భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వుండాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 27: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టర్ జనగామ మండలం చిటకోడూర్ వాగు, రిజర్వాయర్, లింగాలఘనపూర్ మండలం కుందారం వాగులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. వాగుల వద్ద నిరంతర నిఘా వుండాలని, వాహనాలు, పాదచారులు వెళ్ళకుండా రహదారిని మూసి, ప్రత్యామ్నాయ దారుల గుండా ప్రజలు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. 0.3 సామర్థ్యం వున్న చిటకోడూర్ రిజర్వాయర్ నిండుగా వుందని, భారీ వర్షాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా 250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుస్తున్నట్లు ఆయన తెలిపారు. చిటకోడూర్, కుందారం రవాణా వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు చేపడుతున్నట్లు ఆయన అన్నారు. దిజర్వాయర్ నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సమాచారం మేరకు జిల్లా లోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. వర్షాల వలన వాగులు, చెరువులు, నదులు పొంగే ఆస్కారం వుంటున్నందున మారుమూల ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను నీటివద్దకు వెళ్లకుండా గ్రామాల్లో టామ్ టామ్ చేయించాలని, గ్రామస్థాయి అధికారులను ఆయా ప్రాంతాలలో ఉండి ప్రజలు ఎవరు నీటి ప్రవాహం వైపు వెళ్లకుండా చూడాలని తెలిపారు. తక్కువ ఎత్తుగల కల్వర్ట్ లు, బ్రిడ్జి ల సమీపంలోకి ఎవరుకూడా వెళ్లకుండా స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజలకు తెలియజేయాలని, బాధ్యత గల సిబ్బందిని కాపలాగా ఉంచాలని అన్నారు. వర్ష పరిస్థితిపై నివేదికలు సమర్పించాలన్నారు. గతంలో భారీ వర్షాల వలన జరిగిన నష్టంను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా, మండల అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా గ్రామాల్లో గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల గ్రామంలోని సర్వే నెంబర్ 464 లో 15.15 ఎకరాలు, 465 లోని 15.32 ఎకరాల ప్రభుత్వ భూమిని కలెక్టర్ పరిశీలించారు. అభివృద్ధి పనులకు ఇట్టి భూమి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు, జనగామ ఆర్డీవో మధు మోహన్, జనగామ, లింగాలఘనపూర్ తహసిల్దార్లు రవీందర్, వీరస్వామి, ఇర్రిగేషన్ ఏఇ రాజేష్, అధికారులు తదితరులు వున్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post