భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి…… జిల్లా కలెక్టర్ కె. శశాంక

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి…… జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

నర్సింహులపేట, చిన్నగూడూరు,
మహబూబాబాద్ జిల్లా – 23:

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తతో బయటకు వెళ్లకుండా నివాసాల్లోనే ఉండాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.

శుక్రవారం ఉదయం నుండి అధికంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా నర్సింహులపేట, చిన్నగూడూరు మండలాలలో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయిన దృష్ట్యా రామన్నగూడెం మునిగిమడుగు మధ్య గణేష్ చెరువు, గుండ్ల చెరువుపై రెండు గ్రామాల మధ్య లో లెవెల్ బిడ్జ్ పై 2 ఫీట్ల ఎత్తుతో అధిక ప్రవాహంతో, ప్రవహిస్తున్న ఉదృతిని, చిన్నగూడూరు, గుండం రాజు పల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న జిల్లెలవాగు రోడ్డుపై ప్రవహిస్తున్న నీటి మట్టం ను తీవ్రతను అడిషనల్ ఎస్పీ తో కలసి రాకపోకలు జరగకుండా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. శశాంక ఏ.ఎస్పీ యోగేష్ గౌతం తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, శుక్రవారం రోజున అధిక వర్షపాతం నమోదైందని, చెరువులు, కుంటలు, మత్తల్లు పడ్డాయని వాగులు, కాలువలు ఉధృతంగా అధికవేగంగా ప్రవహిస్తున్న దృష్ట్యా ప్రజలు చుట్టుప్రక్కల కు వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని ప్రాణ నష్టం ఆస్తి నష్టo, పంట నష్టాలు, జరగకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలని, చేపల వేట కు, ఈతలకు, బట్టలు ఉతకడం కోసం, చూసేందుకు, అసలు వెళ్లరాదని, అవసరం ఉంటే తప్ప ఎవరు బయటకు వెళ్లకూడదని, జంతువులను పాకల్లోనే కట్టేసి మేపుకోవాలని, గోడలు నిమ్ము రావడం, బట్టలు అరవేసుకునే సమయాల్లో జాగ్రత్తలు వహించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అవసరం మేరకు ఇసుక నింపుకొని బస్తాలను అందుబాటులో ఉంచుకోవాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో సత్యనారాయణ, ఎం పీ ఓ సోమ్లాల్ , ఎంపిటిసి రవి చిన్న గూడూరు మండలం తహసిల్దార్ ప్రసాద్, ఎంపీడీవో శ్యామ్ సుందర్, ఎంపీపీ వెంకట్ రెడ్డి, సర్పంచ్ మల్లయ్య, ఎం పి ఓ సిహెచ్ వెంకన్న సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post