భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఢిల్లీ నుంచి సీఎం శ్రీ కేసీఆర్ సమీక్షించారు. ఈ మేరకు సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి తగు ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతూ వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు.ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో తమ తమ నివాసాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలని, వర్ష ప్రభావిత, వరద ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం కోరారు.
You Are Here:
Home
→ భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని ఢిల్లీ నుంచి సీఎం శ్రీ కేసీఆర్ సమీక్షించారు
You might also like:
-
Chief Secretary Santhi Kumari asked the officials to come prepared with all details for the upcoming visit of the Election Commission of India (ECI) officials to the state.
-
గణేష్ శోభాయాత్ర, నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
-
రాష్ట్రంలో ఏర్పడే సామాజిక పింఛనుల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. పంట రుణాల మాఫీ, ఎరువుల పంపిణీ, జిఓ 58, 59 అమలు, గృహలక్ష్మి, ఆసరా పింఛన్లు, సాంఘిక సంక్షేమ ఇళ్ల స్థలాల పంపిణీ, తెలంగాణకు హరితహారం, గ్రామ పంచాయతీ భవనాలు, ఆయిల్ పామ్ తోటల తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
-
అమెరికా అబర్న్ యూనివర్సిటీతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ ఒప్పందం