భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి :::కలెక్టర్ బి.గోపీ

భారీ వర్షాల పట్లఅఅన్నీ శాఖల అధికారులు, ప్రజలు అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ గోపీ తెలిపారు.

ఎడతెరిపి కురుస్తున్న వర్షాల వల్ల జరిగే ప్రమాదాలను,ప్రజలకు కలిగే అసౌకర్యాలను జిల్లా యంత్రాంగానికి తెలిపేందుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

భారీ వర్షాల నేపద్యంలో వాగులు వంక లు పొంగి పొర్లుతున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా, బయటికి రాకుండా చూడాలన్నారు.

రెవిన్యూ ,పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి తదితర శాఖ లకు సంబందించిన మండలస్థాయి అధికారులు ఎప్పటికప్పడు పరిస్థితిని సమీక్షించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి ఏమైనా సమస్య లు ఎదురైతే యుద్ధ ప్రాతిపదికన స్పందించాలన్నారు..

ఎక్కడైనా కాలనీ లు జలమయం అయితే సంబంధిత బాదితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు..

కరెంట్ స్థంబాల పట్ల ప్రజలు జాగ్రత్త గా ఉండాలని,వర్షం పడుతున్న సమయంలో వాటి పరిసరాల్లోకి ప్రజలు వెళ్ళొద్దని సూచించారు..

చెరువులకు గండి పడితే రోడ్ లు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు వెంటనే తగు చర్యలు చేపట్టి,ఏదేని చెరువు గండి పడే పరిస్థితి కనిపిస్తే తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకోని,యుద్ద ప్రాతిపాదికన మరమత్తు చర్యలు చేపట్టాలన్నారు..

వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడలన్నారు..

శిథిలావస్థ ఇండ్లలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కూలిపోయే ప్రమాదం ఉన్న ఇండ్లలో నివసించే ప్రజల ను పునరావాస కేంద్రాలకు తరలించాలని అన్నారు.

ఎప్పటికప్పుడు అధికారులు సమన్యయంతో పనిచేస్తూ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు చేపట్టాలన్నారు..

అత్యవసరం అయితే తప్ప బయట కు రావద్దని…ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని,ప్రజలు తమకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే ఈ క్రింది నెంబర్ల కు
9154252937, 1800 425 3424 ఫోన్ చేసి వెంటనే సహాయాన్ని పొందవచ్చన్నారు..

కంట్రోల్ రూమ్లో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని కలెక్టర్ పేర్కొన్నారు.

Share This Post