భారీ వర్షాల ప్రమాదంలో మృతి చెందిన తాటి రవీందర్ మృతదేహాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్…

ప్రచురణార్థం

భారీ వర్షాల ప్రమాదంలో మృతి చెందిన తాటి రవీందర్ మృతదేహాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్…

మహబూబాబాద్, జూలై-23:

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బయ్యారం మండలం మొట్ల తిమ్మాపురం గ్రామవాసి తాటి రవీందర్ పొలానికి వెళ్లి రాత్రి వేళలో వాగు దాటుతూ ప్రాణాలు కోల్పోయినందున తప్పనిసరిగా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

శుక్రవారం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ను జడ్పీ చైర్మన్ కుమారి బిందు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి, మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ తో కలిసి తాటి రవీందర్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సంఘటన ఎంతో దురదృష్టకరమని భారీవర్షాల లో అందరూ ఇంటివద్దే ఉండాలని వ్యవసాయ పొలాలకు వెళ్లరాదని వాగులు వంకలు దాట రాదని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉండవలసిన వారు అర్థంతరంగా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం పడే బాధలు వర్ణనాతీతం అన్నారు .

ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని తప్పనిసరిగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
—————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post