భారీ వర్షాల వలన ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

పత్రికా ప్రకటన తేది: 30.08.2021

భారీ వర్షాల వలన ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం.

జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ.

౦౦౦౦౦

జిల్లాలో భారీ వర్షాల వలన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ తెలిపారు.
సోమవారం BRK భవన్ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇరిగేషన్, ఇతర అధికారులతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదల వలన తీసుకుంటున్న ముందస్తు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, క్షేత్ర స్థాయిలో అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని, టెలీ కాన్ఫెరెన్ ద్వారా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, పోలీస్ సహకారంతో వరదల వలన ప్రజలకు ఎలాంటి నష్టం కలుగాకుండా సహాయసహకారాలు అందిస్తున్నామని తెలిపారు. అధికారులను వారివారి క్షేత్రాల్లో ఉండేవిధంగా ఆదేశించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-5566 ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలిపేవిధంగా విస్తృత ప్రచారం చేస్తున్నామని, వచ్చిన సమస్యలకు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో శ్రీరాంసాగర్, స్వర్ణ, కడెం ప్రాజెక్టులలో సాధారణ నీటి మట్టం కన్నా ఒక మీటర్ తక్కువ ఉండేవిధంగా ఎప్పటికప్పుడు పరిశీలించి నీటిని కిందకి వదలడం జరుగుతుందని తెలిపారు.ఇటీవల కురిసిన వర్షాలతో చెరువులు పూర్తీ సామర్థ్యముతో నిండి ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు గెట్ లను తెరిచే సమయంలో పోలీస్, రెవెన్యూ అధికారులకు, ఆయా గ్రామాల ప్రజలకు ముందస్తు సమాచారం అందించడం జరుగుతుందని అన్నారు. వరద ఉదృతి సమయంలో ప్రజలు ఎవరు కూడా నీటి ప్రాంతానికి వెళ్లకుండా ఉండాలని, ఆయా ప్రాంతాలలో ముందస్తుగా తెలియజేయడం జరుగుతున్నదని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఇరిగేషన్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

***************************జిల్లా పౌర సంబంధాల అధికారి, నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post