భారీ వర్షాల వల్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

 

భారీ వర్షాల వల్ల నేడు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు .

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
O0O00

జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మంగళవారం రోజున ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు.

వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లా ను రెడ్ అలర్ట్ గా ప్రకటించినందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత మండల తహశీల్దార్లకు, మున్సిపల్ కమిషనర్లకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని, వర్షాలు తగ్గేవరకు ఇళ్లలోనే ఉండాలని కలెక్టర్ సూచించారు. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొరలే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు కూడ వాగులను దాటే ప్రయత్నం చేయకూడదని అన్నారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికారులు, మండల అధికారులు, హెడ్ క్వార్టర్ లో ఉండి ప్రజలకు అత్యవసర సేవలందిస్తూ, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

 

Share This Post