భావాజీ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి:- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా
తేది: 25-03-2023
భావాజీ జాతర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి:- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఏప్రిల్ 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్న గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ లోకామాసందు బావాజీ ఉత్సవాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనంగా నిర్వహించుకునేవిధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కోయ శ్రీ హర్ష కొడంగల్ ఎమ్మెల్లే పట్టం నరేందర్ రెడ్డి తో కలిసి మద్దూర్ మండల తిమ్మారెడ్డి పల్లి బావాజీ జాతర ఏర్పాట్ల పై అధికారులతో కలెక్టరేట్ వీడియో కాన్ఫెరెన్స్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే జిల్లా లో గిరిజనులు కోలుచే ఇష్ట దైవం అయిన భావాజీ జాతర నారాయణపేట జిల్లా లో గిరిజనులు చాల భక్తి శ్రద్దలతో చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, ఈ సంవత్సరం వేడుకలను ఘనంగ నిర్వహించే విదంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతరకు దేశ నలుముల లోంచి విచేస్తారని జిల్లా కలెక్టర్ దృష్టికి తిసుకోచారు. జిల్లా లోనే అతి పెద్ద జాతరగా ఇర్వహించడం జరుగుతోందని గిరిజనుల కు కొలువైన దైవం భావాజీ అని పేర్కొన్నారు. ఏప్రిల్ 5 వ తేది ఉండి 8 వ తేది వరకు జాతర జరుగుతోందని ఆలయకమీటీ సభ్యులు జిల్లా కలెక్టర్ గారి దృష్టి కి తీలుకొచ్చారు. జాతర లో ఏర్పాటు పై జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో అడిగి తెలుసుకున్నారు.
నీటి సరఫరా
ట్యాంకర్ ల ద్వారా నీటి నీ సరఫరా చేయాడాం జరుగుతోందని త్రాగడానికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి ని అందించడం జరుగుతాదన్నారు. వాటికీ సంబందించిన ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు.
పంచాయతీరాజ్
రోడ్డు పనులను పర్యవేక్షినచ్చడం జరుగుతోందని గుంతలు పూడ్చి సరిచేయడం జరుగుతోందన్నారు. రథోసహమ్ జరిగే చోట రోడ్డు ను మరమ్మత్తు చేస్తామన్నారు. దుకాణాలు ఆలయ సమీపాన కాకుండా దూరంగా ఏర్పాటు చేసే టట్లు చర్యలు తిసుకోవలన్నారు.
విద్యుత్
జతర జరిగే తేదీలలో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక ట్రాన్స్ఫర్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పోలీస్
ఆయాలనికి దూరం లొనే పార్కింగ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలను తీసుకోవడం జరుగుతుందని రథోత్సహం సమయం లో రోప్ పార్టీ ని నియమించి తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. జాతర లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాడం జరుగుతోందన్నారు. తొక్కిసలాడకుండా జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బలగాలను ఏర్పాటు చేస్తామన్నారు.
బస్సు సౌకర్యం
జిల్లా కేంద్రం నుండి మరియు పాత పాలమూరు నుండి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇతర రాష్టల నుంచి వచ్చే భక్తులు ఉంటారు కాబట్టి ఎలాంటి అసౌకర్యం కలగ కుండ చూడాలన్నారు.
ఆలయ కమీటీ సభ్యులు వాలంటరీస్ లను ఏర్పాటు చేయాలని చుట్టూ పక్కల గ్రామ లలో యువతను జాతర లో వాలంటరీస్ లు నియమించాలని సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక మొబైల్ టాయిలెట్ లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జగతలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జాతర గోడ పాత్రలను విడదల చేశారు.
ఈ కార్యక్రమం లో జిల్లా గ్రామీణాభిరుది అధికారి గోపాల్, ఆర్డీఓ రామచందర్, జిల్లా అధికాయుల మురళి, ఆలయ కమిటి సభ్యులు గోపాల్, కోస్గి జెడ్పిటిసి ప్రకాష్ రెడ్డి సీఐ లు తదితరులు పాల్గొన్నారు.

……………………………………………
జిల్లా పౌర సంభందాల అధికారి ద్వార జారి.

Share This Post