భావితరాలకు కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తిని తెలియజేయాలి-జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 27, 2021, ఆదిలాబాదు:-

            కొండ లక్ష్మణ్ బాపూజీ మహోన్న వ్యక్తి అని, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కొండా లక్ష్మణ్ బాపూజీ చౌక్ వద్ద 106 వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మొదట ఆయన విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్, సంఘ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, తొలి మలి దశల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని, రాజకీయ వేత్త అని అన్నారు. ఆసిఫాబాద్, భువన గిరి నియోజకవర్గాల్లో శాసన సభ్యులుగా ఎన్నికయ్యారని, డిప్యూటీ సీఎం గా పనిచేశారని తెలిపారు. బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి అని, ఆయనను గౌరవించుకోవలసిన అవసరం ఉందని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి భావి తరాలవారికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి రాజలింగం, మాజీ జడ్పీ చైర్మన్ చిట్యాల సుహాసిని, సంఘ నాయకులు ఆశమ్మ, శ్రీనివాస్, ప్రవీణ్, చిక్కాల దత్తు, రమేష్, పార్థసారధి, వెనకబడిన తరగతుల శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులచే ఉత్తేజపూరితమైన పాటలు ఆలపించారు.

Share This Post