భావితరాలకు సర్వాయి పాపన్న చరిత్ర ఆదర్శం జిల్లా జెడ్పి చైర్పర్సన్ వనజమ్మ

భావితరాలకు సర్వాయి పాపన్న చరిత్ర ఆదర్శం జిల్లా జెడ్పి చైర్పర్సన్ వనజమ్మ

తెలంగాణా ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న 372వ జయంతి అధికారికంగా జరుపుకోవాలని ఆదేశానుసారంగా కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరి చందన దాసరితో కలిసి  నిర్వహించిన జయంతి కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. భావితరాలకు సర్వాయి పాపన్న చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జెడ్పి చైర్పర్సన్ వనజమ్మ పేర్కొన్నారు.

జెడ్పి చైర్పర్సన్ మాట్లాడుతూ అధికారికంగా జయంతి ఉత్సవాలను జరపాలని ఆదేశించినందుకు తెలంగాణా  ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణా రాష్టంలో పుట్టడం గర్వకారణం అన్నారు.

జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి మాట్లాడుతూ…

మొట్టమొదటి సరి సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి అధికారికంగా జయంతి ఉత్సవాలను అధికారికంగా జరుపుకోవాలని అభినందనీయమన్నారు.

గోల్కొండ సామ్రాజ్యంపై 1200 మంది సైన్యం తో మెుఘల్ పాలకుల దౌర్జన్యాలను విరోచితంగా పోరాడి ప్రజలకు విముక్తి కల్పించారన్నారు.

పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికులు గా  పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడన్నారు.  సర్వాయి పాపన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్తో కలిసి జెడ్పి చైర్పర్సన్ పులమలవేసి జ్యోతి ప్ర్రజ్యలన తో సమావేశాన్ని ప్రరంభించారు.

ఈ  కార్యక్రమానికి  అదనపు కలెక్టర్ శ్రీమతి పద్మజా రాణి, ఆబ్కారీ శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ ఎల్. నారాయణ రెడ్డి,  ఆబ్కారి ఎస్సైలు వై.  నాగేందర్, బాలకృష్ణ,  గౌడ సంఘ సభ్యులు,  జిల్లా అధికారులు జిల్లా బీసీ వసతి గృహ సంక్షేమ అధికారులు తదితరులు  పాల్గొన్నారు

Share This Post