+-+——————–
33
0*ప్రచురణార్థం*
తొర్రూర్ / మహబూబాబాద్ 26 జనవరి:
*మన రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం* ..
*గణతంత్ర దినోత్సవమే నిజమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు*…..
74వ గణతంత్ర వేడుకలను తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని జెడ్పీఎస్ఎస్ హైస్కూల్ మైదానంలో కన్వీనర్ పొనుగోటి సోమేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన 100 అడుగుల జాతీయ పతకాన్ని మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, భావితరాల శ్రేయస్సుకు సృష్టికర్త అని, ఎందరో త్యాగమూర్తుల పోరాట ఫలితమే అనుభవిస్తున్న స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం లౌకికవాదానికి నిదర్శనమని, మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే నిజమైన పండుగ రోజని,మనకంటూ కొత్త రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామని, రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెల 18 రోజులు పట్టిందని, ఆనాడే 64 లక్షల రూపాయల ఖర్చు అయ్యిందని, 200 ఏండ్ల బ్రిటిషర్ల పాలన నుంచి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించినప్పటికీ 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించిందని స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించినదే *గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాధాన్యత అని మంత్రి అన్నారు*
మన రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఎన్నో ఘనవిజయాలు సాధించాయని, 8 ఏళ్లలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా తనదైన శైలిలో అభివృద్ధిలో నడుపుతున్న మహాననీయుడని అన్నారు.
రాష్ట్ర చీకట్లను చీల్చి 24 గంటల నాణ్యమైన కోతలు లేని కరెంటుతో మన కళ్ళలో విరజిమ్ముతున్న కాంతుల్ని పంచుతున్న మహానీయుడని, దానికి నిదర్శనం మన తొర్రూరు పట్టణంలో డివైడర్లు, ఏర్పాటు చేసుకున్న సెంట్రల్ లైటింగ్ వంటివి వాటికి ఉదాహరణలు అని మంత్రి అన్నారు. మిషన్ భగీరథ తో తాగునీరు ప్రతి గడపకు అందిస్తున్నామని, మిషన్ కాకతీయతో గొలుసుకట్టు చెరువుల పూడికతీత చెరువుల పునరుద్ధరణతో కాలేశ్వరం ప్రాజెక్టుతో దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేస్తూ రైతుబంధుతో పెట్టుబడి సహాయం అందిస్తూ రైతే రాజు రైతు అభివృద్ధి రాష్ట్ర, దేశ అభివృద్ధికి నాంది అన్నారు.
వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని జిల్లాకు కొత్తగా వైద్య కళాశాల నర్సింగ్ కళాశాలలను తెప్పించుకొని ఉన్నత విద్యను అందించడం జరుగుతుందని, ఇంజనీరింగ్ కళాశాల కూడా త్వరలోనే నిర్మించుకోబోతున్నామని, మన ఊరు మనబడి ప్రణాళిక తో ప్రవేట్ స్కూల్ లకు దీటుగా 6 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలలో అన్ని విధాలుగా పనులను చేపట్టి మెరుగైన వసతులను కల్పిస్తున్నామని, మహర్దశ సంతరించుకొని శోభాయమానంగా నేడు ప్రభుత్వ పాఠశాలలు వెలుగుతున్నాయని, విద్యార్థులు కష్టపడి చదువుతూ క్రీడా సాంస్కృతిక సేవా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొంది భవిష్యత్తులో స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ ఎల్ రమేష్, ప్రజా ప్రతినిధులు, అధికారులు వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పార్టీ శ్రేణులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.