భువనగిరి పట్టణమునకు చెందిన పడమటి అన్విత రెడ్డి చలికాలంలో క్లిష్ట పరిస్థితుల్లో రష్యా లోని మౌంట్ ఎల్ బ్రస్ పర్వతమెక్కిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు

భువనగిరి పట్టణమునకు చెందిన పడమటి అన్వితరెడ్డి ని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత, గంటకు 64 కి.మీ. వేగంతో వీచే ఈదురు గాలుల మధ్య 16,500 అడుగులు గల రష్యాలోని మౌంట్ ఎల్ బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన అన్విత యాదాద్రి భువనగిరి జిల్లాకు  చెందిన మహిళాగా జిల్లాకు గర్వకారణం అని  అన్నారు.
పడమటి అన్విత రెడ్డి గతంలోనూ పర్వతాలను అధిరోహించారు.
2015 సంవత్సరంలలో రీనోక్ పర్వతం 4500 మీటర్లు.
2019 సంవత్సరం లో బసి రాయ్ పర్వతం 6000 మీటర్లు.
2021 సంవత్సరంలో సౌత్ఆఫ్రికాలోని కిలిమoజారో పర్వతం 5849 మీటర్లు.
2021 సంవత్సరంలో మౌంట్ ఖడే పర్వతం 6000 మీటర్లు.
కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి , జిల్లా యువజన సంక్షేమ అధికారి కె.ధనంజనేయులు, సురేందర్, సిలివేరు సైదులు, జి మురళి పాల్గొన్నారు.

Share This Post