భూగర్భ జలాల పెంపునకు కృషి చేయండి-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

భూగర్భ జలాల పెంపునకు కృషి చేయండి-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

భూగర్భ జలాల పెంపుదలకు వ్యూహాత్మక ప్రణాళిక తో శాస్త్రీయ పద్దతిలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో హైదరాబాద్ దక్షిణ ప్రాంతానికి చెందిన కేంద్ర జల శక్తి విభాగపు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వారు మెదక్ జిల్లాకు సంబంధించి రూపొందించిన అక్విఫర్ మ్యాప్ లు (జలాశయ పటాలు) మరియు నిర్వహణ ప్రణాళికలను సైటిస్టులు మహాదేవ్, విట్టల్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి నివేదికను జిల్లా పాలనా యంత్రాంగానికి అందజేశారు. ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బృందం మెదక్ జిల్లాలో చేపట్టిన మిషన్ కాకతీయ, బిందు , తుంపర సేద్యం, చెక్ డ్యాంలు, పేర్కొలేషన్ ట్యాంకులు, వాటర్ షెడ్స్ , వర్షపు నీటిని నిలువ చేయడం, ఫామ్ పాండ్స్ వంటి పలు పధకాల ఫలితాలను అధ్యయనం చేసి భూగర్భ జలాల పెంపునకు ఇంకా చేపట్టవలసిన వివిధ కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ నివేదిక అందించారు. జిల్లాలోని ఏడు మండలాలలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, శాస్త్రీయ పద్దతిలో కార్యకలాపాలు చేపడితే భూగర్భ జలాలు మెరుగుపడతాయాని అన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు మంచినీటిని అందించాలంటే ప్రతి ఒక్కరు నీటి పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని, వాన నీటిని సంరక్షించుకోవాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు, పాటశాలలో రూఫ్ వాటర్ సంరక్షణ చేపట్టాలని, వ్యవసాయరంగంలో బిందు, తుంపర సేద్యం వంటి పద్దతులు అవలంబించాలని అన్నారు. అదేవిధంగా చెక్ డ్యాంలు, ఇంకుడు గుంతల వంటి నిర్మాణాలు విరివిగా చేపట్టడం వల్ల భూగర్భ జలం పెరిగి సాగు నీటికి ,తాగు నీటికి సమస్యలు ఉండవని అన్నారు. భూగర్భ జలాల పెంపునకు ఎన్నో రకాల వనరులున్నాయని, ఏ పనులు చేపడితే భూగర్భ జలాలు మెరుగుపడతాయో పరిశీలించి అట్టి కతృవులో అందరిని భాగస్వాములను చేయాలని , ముఖ్యంగా గ్రామా స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో జలశక్తి కార్యక్రమం క్రింద డి.ఆర్.డి.ఓ. , అటవీ, నీటిపారుదల, ఆర్.డబ్ల్యూఎస్, వ్యవసాయ,ఉద్యాన, పంచాయతీ రాజ్ , విద్యా శాఖ తదితర శాఖల చేపడుతున్న కార్యక్రామాలు విస్తృతం చేయాలని, ఇంతవరకు సాధించిన ప్రగతి పై విజయగాధలు, ఫోటోలు పంపాలని ప్రతిమ సింగ్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ సీఈఓ శైలేష్, డీఆర్ డిఓ శ్రీనివాస్, డి.ఎఫ్.ఓ. రవి ప్రసద్, , డి.పి .ఓ. తరుణ్ కుమార్, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాస్, మునిసిపల్ కమీషనర్ శ్రీహరి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post