భూగర్భ జల వనరుల మదింపు 2019-20 పుస్తకం ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్* # భూ గర్భ జలవనరుల శాఖ డి.డి. కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

నల్గొండ, జనవరి 25. భూగర్భ జలవనరుల శాఖ డి.డి.కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సందర్శించి తనిఖీ చేశారు.క్లాక్ టవర్ ఐ.బి.కార్యాలయ ఆవరణలో ఉన్న భూగర్భ జలవనరుల శాఖ డి.డి.కార్యాలయం ను తాత్కాలికంగా పాత జడ్.పి.కార్యాలయం లోకి తరలించారు.నల్గొండ జిల్లాలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన లో క్లాక్ టవర్ వద్ద ఉన్న ఐ. బి.,ఆర్&బి,భూగర్భ జలవనరుల శాఖ కార్యాలయం లు పరిశీలించి పట్టణ అభివృద్ధి కి సూచనలు చేస్తూ వాటి స్థానం లో ఆధునాతన నీలగిరి కళాభారతి,కొత్త కార్యాలయం లు నిర్మించాలని సూచించారు. ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ ఆదేశాల ననుసరించి భూ గర్భ జలవనరుల శాఖ డి.డి.కార్యాలయం పాత జడ్.పి.భవనం లోకి తరలించారు.కార్యాలయం కు అవసరమైన స్టార్ రూమ్,కంప్యూటర్ ల్యాబ్ ఇతర సౌకర్యాలు కల్పించాలని జడ్.పి.,సి.ఈ. ఓ.,పి.ఆర్.డి.ఈ. లను కలెక్టర్ ఆదేశించారు.అనంతరం భూగర్భ జలవనరుల శాఖ గ్రామ వారీగా 2019-20 సంవత్సరం కు భూగర్భ జలవనరుల మదింపు చేసి రూపొందించిన భూగర్భ జలవనరుల మదింపు 2019-20 పుస్తకం కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ బాల కేంద్రం భవనం పరిశీలించి భవనం,ఖాళీ స్థలం వివరాలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో భూ గర్భ జలవనరుల శాఖ డి.డి.సునీల్ బాబు,జడ్.పి.సి.ఈ. ఓ. వీర బ్రహ్మ చారి, పంచాయతి రాజ్ డి.ఈ.నాగయ్య,డి.ఈ. ఓ.భిక్షపతి తదితరులు ఉన్నారు
Attachments area
భూగర్భ జల వనరుల మదింపు 2019-20 పుస్తకం ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్*
# భూ గర్భ జలవనరుల శాఖ డి.డి. కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

Share This Post