భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిలో స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లాలోని ప్రజలు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.

భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిలో స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని జిల్లాలోని ప్రజలు వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. గురువారం మధ్యాహ్నం భూపాలపల్లి పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు . డాక్టర్ విజయకుమార్ జనరల్ సర్జన్, డాక్టర్ చందు నాయక్ ఆర్థోసర్జన్, డాక్టర్ రాజు పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ సంజీవయ్య ఫిజీషియన్, డాక్టర్ లావణ్య గైనకాలజిస్ట్, డాక్టర్ మౌనిక మెడికల్ ఆఫీసర్, డాక్టర్ విదుష డాక్టర్లందరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని అలాగే ప్రధాన ఆస్పటల్ నందు మెట్టెనిమిటి వార్డు, ఈసీజీ, ఎక్స్ రే, ల్యాబ్ అన్ని రకాల పరీక్షలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుందని ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు దీటుగా భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిని సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జనరల్ వార్డులోని రోగులను అందుతున్న వైద్య సేవలను, సౌకర్యాలను భోజన వసతి గురించి అడిగి తెలుసుకున్నారు. జనరల్ వార్డులో బెడ్స్ పై బెడ్ షీట్ లేకపోవడంపై కలెక్టర్ సిబ్బందితో బెడ్ షీట్స్ వేయించారు. ప్రతిరోజు ఆసుపత్రిలో అందించే భోజనం మెనూ వివరాలు వార్డులో ప్రదర్శించాలని, ఆసుపత్రికి వచ్చు పేషెంట్స్ కు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు వడ్డించే భోజనాన్ని కలెక్టర్ స్వయంగా తిని పరిశీలించారు, ఉదయం ఆల్ఫా హారాన్ని అందించలేదని డాక్టర్లు కలెక్టర్కు తెలిపారు .ఆసుపత్రిలో బ్లడ్ యూనిట్లు నిల్వలు పెంచుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. వంద పడకల ఆసుపత్రి నందు నిరంతరం ప్రజలకు అన్ని వైద్య సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలియజేశారు. అనంతరం ఆసుపత్రి లోని వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో శ్రీరామ్, ఆసుపత్రి సూపర్డెంట్ సంజీవయ్య, ఆర్ ఎం ఓ డాక్టర్ ప్రవీణ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


———————————————–
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ జయశంకర్ భూపాలపల్లి వారిచే జారీ చేయనైనది.

Share This Post