భూపాలపల్లి లోని DR బి ఆర్ అంబేద్కర్ స్టేడియం లో ఏప్రిల్ 03,04 తేదిలలో జరిగిన 8 వ తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ నిర్వహించడం జరిగినది. ఈ పోటిలలో యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన ప్రాథమిక పాటశాల, బద్దునయాక్ తండ, ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి దొడ్ల విజయ గారు పాల్గొని 3 బంగారు పతకాలు సాదించడం జరిగిందని శ్రీ కే. ధనంజనేయులు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా గారు తెలిపినారు.

వీరు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గారి కార్యాలయంలో శ్రీమతి దొడ్ల విజయ ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలపడం జరిగినది.
యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన ప్రాథమిక పాటశాల బద్దునయాక్ తండ, ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి దొడ్ల విజయ గారు చెన్నై లో జవహర్ లాల్ నెహ్రు స్టేడియం లో జరిగే జాతీయ మాస్టర్స్ చాంపియన్ లో తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక కావడం జరిగినదని, వీరు భూపాలపల్లి లోని DR బి ఆర్ అంబేద్కర్ స్టేడియం లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని 5 KM నడక పోటిలలో బంగారు పథకం, షాట్ పూట్ లో బంగారు పతకం మరియు లాంగ్ జంప్ పోటిలలో బంగారు పతకం సాదించి జాతీయ మాస్టర్స్ కు ఎంపిక కావడం జరిగినదని, గతంలో శ్రీమతి దొడ్ల విజయ గారు హర్యానా గుర్గాన్ లో జరిగిన అల్ ఇండియ సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్ జాతీయ స్థాయి పోటిలలో పాల్గొని 7 వ స్థానం సాదించారని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని పతకాలు సాదించడం జరిగినదని తెలియజేసినారు.
శ్రీమతి దొడ్ల విజయ గారి క్రీడా జీవితం యాదాద్రి భువనగిరి జిల్లా మరియు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని క్రీడాకారులకు ఆదర్శం మరియు స్పూర్తిదాయకం కావాలని జిల్లాలోని క్రీడాకారులు అదిక సంఖ్యలో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో పాల్గొని, పతకాలను సాదించాలని అలాగే జిల్లాకు మరియు రాష్ట్ర ని కి గొప్ప పేరు తీసుకురావాలని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కే ధనంజనేయులు గారు అకాంక్షిoచారు.
ఇట్టి కార్యక్రమంలో సిబ్బంది సిలివేరు సైదులు, మురళి, పి జయ పాల్గొన్నారు.

Share This Post