భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్క బ్రతికేలా, ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ  లోని సిఆర్ నగర్ కాలనీ పరిధిలోగల ఈద్గా వద్ద ఎనిమిదో విడత హరితర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధూ, భూపాలపల్లి జెడ్పి వైస్ చైర్మన్ శోభ, జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, జిల్లా అదనపు కలెక్టర్ దివాకర పాల్గొన్నారు. ముందుగా 5 స్వచ్ఛ ఆటోలు, ఒకటి కంపాక్టర్ బిన్, ఒకటి వైకుంఠ రథం, ఏడు వాహనాలను మొదటగా ముఖ్య అతిథులు ప్రారంభించి, అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో   భావితరాలకు బంగారు బాట వేయాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇక్కడ నాటిన ప్రతి మొక్క బ్రతికేలా చూడాలని మళ్లీ పండుగకు వచ్చి చూస్తానని, పూర్తి బాధ్యత ఈద్గా సభ్యులు పై పెడుతున్నానని శాసనసభ్యులు తెలిపారు. పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ డబల్ రోడ్లు చేయుట కొరకు విద్యుత్ స్తంభాలను తరలించడానికి అనుమతులు పొందినట్లు శాసనసభ్యులు తెలిపారు. భూపాలపల్లి లో అక్రమ లేకున్నా పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. భూపాలపల్లి జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకొని వెళుతున్న జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్ర ను ఎమ్మెల్యే కొనియాడారు. వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అడవుల శాతం తక్కువగా ఉందని, ఆలోచించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఏడు విడుతలుగా హరితహారం కార్యక్రమాన్ని పూర్తి చేసి, ఎనిమిదో విడత హరితహారాన్ని ప్రారంభించుకున్నామని, ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి సంకల్పం, పట్టుదల చెట్లు విరివిగా పెంచి భావితరాలను కాపాడాలనే ఉద్దేశంతో హరితహర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని చైర్పర్సన్ తెలిపారు. మొక్కలను నాటడమే కాక సంరక్షించుకునే బాధ్యత  ప్రభుత్వ సిబ్బందితోపాటు, ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉంటుందని నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోబడతాయని చైర్పర్సన్ తెలిపారు. గతంలో అహల్లాదం కోసం బెంగళూరు, మైసూరు వెళ్లేవారని కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా వాటికి దీటుగా మొక్కలు పెంచుతున్నామని చైర్పర్సన్ తెలిపారు. వరంగల్ కు దీటుగా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా గారి కృషి ఫలితంగా జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని జెడ్పీ చైర్పర్సన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న అటవీ ఇప్పుడు 27 శాతానికి పెరిగిందని 33 శాతం లక్ష్యం గా మొక్కలు పెంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. వాతావరణ సమస్యల వల్ల మనదేశంలో భారీ వర్షాలు ఇతర దేశాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయని ఇందుకు కారణం మానవాళి ద్వారా వస్తున్న కార్బన్డయాక్సైడ్ వల్ల వాతావరణం పూర్తిగా మారిపోతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో అడవి తరిగిపోతుందని కానీ తెలంగాణ రాష్ట్రంలో అడవి పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 8వ విడత హరితహారం లో 100కు 100% మొక్కలు బ్రతికేలా గ్రీన్ కమిటీలు పర్యవేక్షించాలని కలెక్టర్ అన్నారు. వార్డులలో మొక్కలను నాటి సంరక్షించిన వారికి జూన్ రెండవ తారీఖున అవార్డుల ప్రధానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీలో సిబ్బందిని కొత్త వాహనాలను సమకూర్చడం జరిగిందని, కలెక్టర్ తెలిపారు. పారిశుద్ధ్య విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని చెత్తను చేరివే వాహనాలకు జిపిఎస్ డివైస్ సాఫ్ట్వేర్ను అనుసంధానం చేశామని దీని ద్వారా ట్రాక్టర్, మున్సిపాలిటీ తడి పొడి వాహనాల కదలికలు తెలుస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.2010 సంవత్సరంలో మలేరియా, డెంగ్యూ అధికంగా ఉండేదని కానీ ఇప్పుడు భూపాలపల్లి జిల్లాలోనే  10 అంకెను దాటలేదని దీనికి కారణం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మొక్కలు నాటడం వల్లనే వ్యాధులు తగ్గుముఖం పట్టాయని కలెక్టర్ అన్నారు. వరదల వల్ల హరితహారం కార్యక్రమం కొంత ఆలస్యమైందని, వాట్సాప్ ద్వారా మీ సమస్యలను తెలపవచ్చని కలెక్టర్ తెలియజేశారు. గ్రీన్ కమిటీ సభ్యులు టీం ఇండియాల పని చేయాలని కలెక్టర్ అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, జడ్పీ వైస్ చైర్మన్ కే. శోభ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ కూడా చేపట్టాలని ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలని వారు కోరారు.  ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. జిల్లా కలెక్టర్ మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య సిబ్బందికి వర్షంలోనూ ఆటంకం కలగకుండా పనిచేయుటకు రైన్ కోట్స్ అందజేశారు. అనంతరం హరితహారం  పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు, పిఎసియఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి శారద నారాయణ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post