భూపాలపల్ల్ కేంద్ర ఆస్పత్రిలో క్వరంటాయిన్ సెంటర్ ఏర్పాటు చేయాలి – జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్య

* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి జూలై 28 (బుధవారం).

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో క్వరంటాయిన్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణా ఆదిత్య వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో గల జిల్లా ప్రధాన ఆస్పత్రిని సందర్శించి ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన సౌకర్యాలు కల్పించడం జరిగిందని వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలు కోవిడ్ మరియు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సేవలందించాలన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి పై అంతస్తులో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి సేవలు అందించేలా క్వారంటైన్ కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే జిల్లాలో కోవిడ్ కేసులు అధికంగా నమోదవుతున్న మండలాలు, గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆయా గ్రామాల్లో, మండలాల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రజలందరికి కోవిడ్ టీకాలను ఇప్పించాలన్నారు. కోవిడ్ టీక కేంద్రాల్లో ప్రజలు గుమికూడకుండా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురుస్తున్నoదున మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ఆయా కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల సహకారంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు గ్రామాల్లో జరిగేలా చూడాలని అన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గల మాతా,శిశు సంరక్షణ కేంద్రంలో ప్రసవాలు మరియు వైద్యపరీక్షల కోసం వచ్చే గర్భిణీలకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలను సకాలంలో నిర్వహించాలని, ఆస్పత్రి సిబ్బంది కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో సాధారణ ప్రసవాలు జరిగేలా క్షేత్రస్థాయి వైద్య ఆరోగ్యశాఖ మరియు అంగన్వాడి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని అలాగే పిల్లల్లో నిమోనియా నివారించుటకు ఆగస్టు నెలలో పిసివి టీకాలను వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రజారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆస్పత్రి ఆవరణను ఆర్అండ్ బి ఇంజనీర్లు మరియు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి పరిశీలించే వర్షం నీరు మరియు ఆస్పత్రిలో ఉపయోగించే నీరు ఆస్పత్రి ఆవరణలో నిలువకుండా బయటకు శుద్ధిచేసి తరలించేందుకు మరియు ప్రధాన రహదారికి అవతల రిజర్వ్ ఫారెస్ట్ నుండి మైసమ్మ గుడి ప్రక్కనుండి వస్తున్న నీటిని నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సముదాయ భవనానికి సంబంధం లేకుండా ఆస్పత్రి ఆవరణలో గల కాలువ నుండి చెరువులోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఆస్పత్రికి ప్రధాన రహదారి నుండి ప్రస్తుతం ఉన్న దారికి బదులుగా ప్రత్యామ్నాయ దారిని ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. శ్రీరామ్, డిసిహెచ్ఎస్ డాక్టర్. తిరుపతి, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ లు డాక్టర్. కొమురయ్య, డాక్టర్. శ్రీదేవి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్. మమత, డాక్టర్.రవి, ఆర్ అండ్ బి ఇఇ వెంకటేష్, డిఇ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.

Share This Post