భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ బిడ్డ కావడం గర్వించదగ్గ విషయమని అదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన  తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ తెలంగాణ బిడ్డ కావడం గర్వించదగ్గ విషయమని అదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు. సొనవారం ఉదయం  వీరనారి చాకలి ఐలమ్మ 103వ జయంతి సందర్బంగా  కలెక్టరేట్ లో ఘనంగా నివాళులర్పించారు.  జిల్లా బిసి సంక్షేమ శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్  ముఖ్య అతిథిగా హాజరై వీర నారీ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి  జ్యోతి ప్రజ్వలన   చేసి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పేద రైతులు, మహిళల పట్ల నిజాం పాలనలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి స్ఫూర్తి ప్రదాతగా మరారన్నారు. నాటి తెలంగాణ రజాకార్ల ఆగడాలు, అకృత్యాలకు  వ్యతిరేకంగా ఒక నారీ  చూపిన ధైర్య సాహాసాలు, పోరాటం ఎందరో ఉద్యమకారులకు స్ఫూర్తిని ఇచ్చిందన్నారు.   వీర నారీ చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అధికారికంగా జరపడం    సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమం లో జిల్లా బిసి సంక్షేమ అధికారి కృష్ణమ చారి, జిల్లా అధికారులు,  ఆర్డీఓ రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post