భూసారాన్ని బట్టి మొక్కలు నాటాలి…

ప్రచురణార్థం

భూసారాన్ని బట్టి మొక్కలు నాటాలి.

తొర్రుర్, అక్టోబర్ 3.

భూసారాన్ని బట్టి మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

ఆదివారం తొర్రుర్ మండలంలోని
జమస్థాన్ పురం, సోమారం గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. జమస్థాన్ పురం గ్రామ పరిధిలోని 42,44,48 సర్వే నెంబర్ ల 10 ఎకరాల్లో నిర్మిస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనంను జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించి భూసారాన్ని బట్టి మొక్కలు నాటాలన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. తదనంతరం సోమారం గ్రామాన్ని సందర్శించి పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం లను సందర్శించారు పల్లె ప్రకృతి వనం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ మరింత అభివృద్ధి పరచాలని పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు

కలెక్టర్ వెంట ఆర్డీఓ రమేష్ జడ్పి సీఈఓ రమాదేవి, డి.ఆర్.డి.ఏ.పీడీ సన్యాసయ్య,డి.పి.ఓ.రఘువరన్, కాకిరాల హరిప్రసాద్ తాసిల్దార్ రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
—————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post