భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ చట్టాల పట్ల నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకొని సమగ్ర అవగాహన, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పేర్కొన్నారు.

ప్రచురణార్ధం

నవంబరు 06, ఖమ్మం:

భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ చట్టాల పట్ల నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకొని సమగ్ర అవగాహన, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక టి.టి.డి.సి సమావేశ మందిరంలో భూసేకరణ, ఆర్. అండ్.ఆర్ చట్టాలపట్ల, కోర్టు కేసుల పరిష్కార చర్యలపై రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు ఏర్పాటు చేసిన వర్క్ షాపును కలెక్టర్ వి.పి.గౌతమ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్త భూసేకరణ ఎక్కువగా లేదని, సీతారామ ప్రాజెక్టు, ఎస్.ఆర్.ఎస్.పికు సంబంధించి మాత్రమే జిల్లాలో భూసేకరణ ప్రక్రియ జరుగుచున్నదని ఇప్పటికే నాగార్జునసాగర్ కెనాల్ కోసం అధిక మొత్తంలో భూసేకరణ చేయడం జరిగిందన్నారు. భూసేకరణ చేపట్టే ముందు, చేపట్టిన తర్వాత సమస్యలను అధిగమించేందుకు చట్టాల పట్ల అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అందుకుగాను రెవెన్యూ, నీటిపారుదల శాఖాధికారుల మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని కలెక్టర్ తెలిపారు. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ఆక్రమణలు, రీక్విజేషన్స్, స్థలం యొక్క విలువైన వనరుల పట్ల,  అదేవిధంగా ఒకసారి నీటిపారుదల శాఖకు కేటాయించబడిన ప్రభుత్వ భూములకు ఎట్టి పరిస్థితులలో ఇతర వాటికి కేటాయించకూడదనే ప్రభుత్వ నిబంధలను ఖచ్చితంగా పాటించేలా చట్టాలు, నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. భూసేకరణ చట్టాలను, నిబంధనలను సరిగ్గా పాటించకపోవడం వల్ల డివియోషన్స్ ఏర్పడి కోర్టు కేసులు అధికమవుచున్నాయని, వీటి సత్వర పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉన్నప్పుడే భవిష్యత్తులో కోర్టు కేసుల సంఖ్యను పూర్తిగా తగ్గించవచ్చని కలెక్టర్ తెలిపారు. పునర్విభజన అనంతరం బహు ప్రాజెక్టులు వచ్చాయని, ఆయకట్టు పరిధి పెరిగిందని, గతంలో ప్రత్యేకంగా ఉన్న ఎన్.ఎస్.పి విభాగాన్ని ప్రస్తుతం అన్ని విభాగలతో ఒకే పరిధిలోకి వచ్చాయని, భూసేకరణకు సంబంధించిన విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో రికార్డుల ప్రకారం పరిశీలన చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం ధరణీ పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత భూసంబంధింత క్రయ విక్రయాలు, మ్యూటేషన్ల ప్రక్రియ మండల స్థాయిలోనే తహశీల్దారు -కం – జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ద్వారా అతి స్వల్ప వ్యవధిలో జరుగుచున్నదని, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ధరణీ పోర్టల్లో ఆటోలాక్ మాడ్యుల్ను పొందుపర్చడం జరిగిందని, ఇర్రిగేషన్, రెవెన్యూ అధికారులు ధరణీ పోర్టల్ సేవల పట్లకూడా క్షుణ్ణంగా తమ పరిజ్ఞానాన్ని మరింత పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.

గణాంకవేత్త, డైరెక్టర్ రూఫస్ థాతమ్, నీటిపారుదల శాఖ ఓ.ఎస్.డి జి. మనోహర్ పవర్ పాయింట్   ప్రజెంటేషన్ ద్వారా భూసేకరణ, ఆర్. అండ్ ఆర్ చట్టాలు, నిబంధనలు, కోర్టు కేసుల సత్వర పరిష్కార చర్యల పట్ల రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు సంపూర్ణ అవగాహన కల్పించారు.

అదనపు కలెక్టర్ ఎన్ మధుసూథన్, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరు జి.శంకర్నాయక్, పర్యవేక్షక ఇంజనీర్లు, ఇఇలు, డి.ఇలు, ఏ.ఇ.లు, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాధ్, సూర్యనారాయణ, భూసేకరణ, రెవెన్యూ విభాగపు సంబంధించిన అధికారులు తదితరులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

 

Share This Post