భూసేకరణ, పునరావాస కేంద్రాల పెండింగ్ పనులపై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష

పత్రికా ప్రకటన.                                                                   తేది:17.7 .2021
వనపర్తి.

వివిధ ఎత్తిపోతల పథకాల కింద పెండింగ్ లో ఉన్న భూసేకరణ, పునరావాస కేంద్రాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని   తెలిపారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయా ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ పునరావాస కేంద్రాలు, భూసేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

పాలమూరు- రంగారెడ్డి, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకాల భూసేకరణ, పునరావాస పనులలో పెండింగ్ ఉన్న చోట త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రాజెక్టు పనులు, భూసేకరణ, పునరావాస పనులలో ఏవైనా సమస్యలు ఉన్నట్లైతే జాప్యం లేకుండా పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కారం కానీ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

కానాయపల్లి, నాగరాల, కొంకలపల్లి, బండరావిపాకుల తదితర పునరావాస కేంద్రాల్లో పెండింగ్ లో ఉన్న పనులు సత్వరమే పూర్తిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారించిందని ఆమె తెలిపారు.

ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణు గోపాల్, ఆర్.డి.ఓ. అమరేందర్, భీమా ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ సత్యశీలా రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు హాజరయ్యారు.
…………….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Wanaparthy District

 

Share This Post