భూ నిర్వాసితులకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలి జాతీయ బిసి కమిషన్ తల్లోజు ఆచారి.

భూ నిర్వాసితులకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలి జాతీయ బిసి కమిషన్ తల్లోజు ఆచారి.

రిజర్వాయర్ ముంపునకు గురవుతున్న గ్రామ ప్రజలకు వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించి నిబంధనల మేరకు వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చెసి ఇవ్వాలని బి.సి కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నారాయణపేట జిల్లా మాగనూర్, మక్తల్ మండలంలో ఉన్న  చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయిర్, జూరాల బ్యాక్ వాటర్ లో ఉన్న గ్రామాలలో పర్యటించారు.  అక్కడి భూ నిర్వాసితులతో మాట్లాడి వివరాలు సేకరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  భూ నిర్వాసితులకు వెంటనే  ఇండ్ల స్థలాలు కేటాయించాలని నిబంధనల మేరకు నష్ట పరిహారం చెల్లించి అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.    మాగనూర్ మండలం నెరేడ్ గాం లో పర్యటించిన కమిషన్ అధికారుల ద్వారా భూములు కోల్పోయిన వారి వివరాలను తెలుసుకున్నారు. చిట్టెం నర్సిరెడ్డి రిజర్వాయిర్ కు సమీపాన ఉన్న నెరేడ్ గాం గ్రామం లో ప్రతి ఇంట్లో  నీటి ఉటలు వస్తున్నాయని వాటి వలన ఇండ్ల నాణ్యత తగ్గుతుందని గ్రామ ప్రజలు కమిషన్ దృష్టికి తీసుకోచ్చారు. నష్టం జరగక ముందే అధికారులు మేలుకొని  చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆనంతరం మక్తల్ మండలం అనుగొండ, భుత్పురు  గ్రామాన్ని సందర్శించి నది ప్రవాహాన్ని పరిశీలించారు. గ్రామ పంచాయతీ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఇప్పటివరకు కేటాయించిన స్థలాన్ని లేవోట్స్ చేసి వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం త్వరగా కేటాయించాలన్నారు.

ఈ కేయక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, జిల్లా అధికారులు కృష్ణమాచారీ, గోపాల్ నాయక్, మురళి మరియు గ్రామ సర్పంచులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post