భూ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన ధరణి నేటితో వసంతం పూర్తి చేసుకున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు

భూ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన ధరణి నేటితో వసంతం పూర్తి చేసుకున్న సందర్భంలో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

భూ రిజిస్ట్రేషన్లలో ఎన్నో లోపాలు ఉండి 1920 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్లు జరిగేవని ఖఛ్చితమైన భూరికార్డులు లేకపోవడంతో పారదర్శకంగా ఉండాలి, ఒకవేళ రైతు తన వద్ద ఉన్న రికార్డులు పోయినా ప్రభుత్వం దగ్గర రికార్డులు భద్రంగా ఉండాలనే ఉద్దేశ్యముతో రాష్ట్ర ముఖ్యమంత్రి ధరణి పోర్టల్ ను పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్   అన్నారు. శుక్రవారం ధరణి ప్రారంభమై సంవత్సరం పూర్తి అయిన సందర్బంగ కలెక్టరేట్ లో రెవెన్యూ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.    ఈ సందర్బంగ కలెక్టర్  మాట్లాడుతూ ధరణి వచ్చాక  రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ జరిగిపోతున్నాయని,వారం రోజుల్లో  పట్టాదారు పాసు పుస్తకం వచ్చేస్తుందని తెలిపారు.  ఒకప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నే రిజిస్ట్రేషన్లు జరిగేవని ఇప్పుడు అన్ని మండల కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు తెలిపారు.   ధరణి భద్రత పరంగా ఎంతో సురక్షితమైనదని, భూమి  మార్కెట్ విలువ ఎంత ఉంది, స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలి అనేవి పూర్తి పారదర్శకంగా ఉంటాయని తెలిపారు.  ప్రపంచం సాంకేతిక డిజిటల్ రంగంలో  దూసుకుపోతోందని అందులో తెలంగాణ సైతం ఎప్పుడు ముందు వరుసలో ఉంది సాంకేతికతను అవలంభించడంలో భాగంగానే  దేశంలోనే  మొదట డిజిటల్ పరంగా భూరికార్డులను నిక్షేపం చేసే ధరణి అమలు చేయడం జరిగిందన్నారు.   భూములకు భద్రత, భరోసా ఉన్నాయని, 30, 40 ఏళ్ల నుంచి ఎన్నో విధాలుగా భూమి పంచాయతీలు, భూమి సమస్యలు, అభద్రత, ఇతరత్రలకు తెర పడిందని కలెక్టర్  వివరించారు. రానున్న కాలంలో భూ వివాదాలకు తావులేకుండా ధరణి ద్వారా పకడ్బందీ  అయ్యిందని, అవినీతికి తావులేకుండా, అధికారులు ఇష్టం వచ్చినట్లు చేయకుండా పకడ్బందీ వ్యూహంతో ధరణి రూపకల్పన జరిగినట్లు  వివరించారు. జిల్లాలో ధరణి ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు  16628 అమ్మకాలు జరిగాయని, 4592 బహుమతులు, 2274 వారసత్వాలు పూర్తి చేసినట్లు తెలిపారు.  తనఖాలు 73, మ్యుటేషన్లు  5609  పూర్తి చేసినట్లు తెలియజేసారు.   భూసమస్యలు వివిధ మొడ్యూల్ ల్ ద్వారా 5115 పరిష్కరించినట్లు తెలియజేసారు. కోర్ట్ కేసులు 625 రాగా దాదాపుగా అన్ని పరిష్కరించడం జరిగిందని తెలియజేసారు.

జిల్లాలో ధరణి పోర్టల్ విజయవంతంగా అమలు చేయడంపై ఆర్డీఓ లు, తహసీల్దార్ లు, ఇతర రెవెన్యూ అధికారులు చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్  అభినందించారు.  నేడు ధరణి పోర్టల్ విజయవంతం కావడంతో రెవెన్యూ అధికారులు సిబ్బంది అదే విధంగా సమస్యలు వచ్చినప్పుడు రాష్ట్ర రెవెన్యూ అధికారులు ఎంతో కృషి చేయడం జరిగిందని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.  అనంతరం కేక్ కట్ చేసి పంచుకున్నారు.

Share This Post