భూ రికార్డ్ ల నిర్వహణ
, సమస్యల పరిష్కారంలో దేశానికే ధరణి ప్రాజెక్టు ఆదర్శంగా నిలిచినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ధరణి ప్రాజెక్టు ప్రారంభమై సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో పాత్రికేయుల సమావేశం నిర్వహించి కేక్ కట్ చేసి రెవిన్యూ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో వేగంగా, పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారం జరిగిందని చెప్పారు. భూ సమస్యల పరిష్కారంనకు పోర్టల్ అందుబాటులోకి తేవడంపై సీఎం శ్రీ కేసిఆర్ గారికి, సీఎస్ సోమేశ్ కుమార్ గారికి, శేషాద్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా భూ రికార్డ్ ల నిర్వహణకై ధరణి పోర్టల్‌ను అక్టోబర్ 29 2020న సీఎం ప్రారంభించారని చెప్పారు. నేటితో పోర్టల్ విజయవంతంగా ఒక సంవత్సరం కార్యకలాపాలను నిర్వహించామన్నారు. దేశంలోనే భూ పరిపాలనా రంగంలో విప్లవాత్మకమైన ధరణి జిల్లాలో సమర్థవంతంగా అమలు అవుతోందని చెప్పారు. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ గా నిలిచే అద్భుతమైనదని, వివక్ష లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ అని చెప్పారు. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు. ధరణి ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. గతంలో రిజిస్ట్రేషన్ కొరకు ప్రజలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, అప్పుడు జిల్లాలో మూడు రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే ఉండేవని చెప్పారు. ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు ప్రతి తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో 23 తహశీల్దార్ కార్యాలయాల తో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని, ప్రజలకు అందుబాటులోకి రిజిస్ట్రేషన్ సేవలు జరగడం వల్ల ప్రజలకు దూర భారం తగ్గి సమయం కలిసి వస్తున్నట్లు చెప్పారు. భూ పరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పినట్లు చెప్పారు. వ్యవసాయ సంబంధిత భూ రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం నిమిషాల్లో పూర్తి అవుతున్నాయని చెప్పారు గతంలో భూ యజమానులు కు తెలియకుండా మధ్యవర్తులు, దళారులు, పైరవీ కారులు అధికారులతో రికార్డ్లు, పేర్ల మార్పిడి ఘటనలు అక్కడ అక్కడ జరిగేవని, ధరణి అలాంటి ఘటనలకు చెక్ పెట్టిందని చెప్పారు. ధరణి ప్రారంభానికి ముందు రిజిస్ట్రేషన్ చేయడానికి గంటల సమయం పట్టేదని, గతంలో తక్కువ గా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకై ఎంతో మంది వేచి ఉండే పరిస్థితులు సర్వ సాధారణంగా ఉండేవన్నారు. ధరణి రాకతో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నదని చెప్పారు.
పరిపాలనలో ధరణి విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయం:జిల్లా కలెక్టర్ అనుదీప్. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సాహోసోపేతమైన విప్లవాత్మకమైన నిర్ణయం ధరణి అని కలెక్టర్ పేర్కొన్నారు. అనతి కాలంలోనే భూ రికార్డుల ప్రక్షాళన సక్సెస్ పుల్ కావడానికి దోహదపడిందని, రిజిస్ట్రేషన్లు సులభతరం చేసిందని తెలిపారు. ధరణిలో నిక్షేపమైన భూములకు భద్రత, భరోసా ఉన్నాయని, 30, 40 ఏళ్ల నుంచి ఎన్నో విధాలుగా భూమి పంచాయతీలు, భూమి సమస్యలు, భూ అభద్రత, ఇతరత్రలకు తెర పడిందని కలెక్టర్ చెప్పారు. రానున్న కాలంలో భూ వివాదాలకు తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా, అధికారులు ఇష్టం వచ్చినట్లు చేయకుండా పకడ్బందీగా ధరణి రూపకల్పన చేసినట్లు కలెక్టర్ వివరించారు. గతంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత మ్యుటేషన్, పాస్ బుక్ వచ్చేందుకు నెలలు, సంవత్సరాల సమయం పట్టేదనీ , ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే మ్యుటేషన్ జరగడంతో పాటు పాసు బుక్ కొనుగోలు దారుకు వస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడ భూ సమస్యల శాశ్వత పరిష్కారం కు ప్రభుత్వాలు సాహసం చేయని పరిస్థితుల్లో దేశానికే ఆదర్శంగా అతి తక్కువ సమయంలోనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ పట్టుదలతో భూ సమస్యల వివాదాలకు పరిష్కారం, భూ రికార్డుల భద్రతకు తెలంగాణ రాష్ట్రంలోనే నాంది పలకడం జరిగిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రోజు వారీగా వచ్చే దరఖాస్తులు అదే రోజు క్లియరెన్స్ చేస్తున్నామని, రానున్న 2, 3 మాసాల్లో ధరణిలో అన్నీ పరిష్కార మవుతాయని కలెక్టర్ తెలిపారు. రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలలోని అధికారులు ధరణి విధానాన్ని పరిశీలించేందుకు వస్తారని, ఇప్పటికే పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు విషయ సేకరణ జరుపుతున్నట్లు కలెక్టర్ వివరిస్తూ.. దేశానికే ఆదర్శంగా నిలిచిన ధరణి పట్ల జిల్లా రైతుల తరపున, జిల్లా అధికార యంత్రాంగం తరుపున ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ధరణి పోర్టల్ విజయవంతంగా అమలు చేయడంపై ఆర్డీఓ లు, తహసీల్దార్ లు, ఇతర రెవెన్యూ అధికారులు చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ధరణి పోర్టల్ ను ఇతర రాష్ట్రాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతోందన్నారు. దరణిలో నిన్నటి వరకూ వచ్చిన అన్ని అర్జీలను పరిష్కరించామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ధరణి ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ధరణి ప్రత్యేకతలు
* టాంపర్ ప్రూఫ్. *పౌరులకు అనువుగా ఉండడం. *తక్షణమే రిజిస్ట్రేషన్ తోపాటు వెంటనే మ్యుటేషన్ జరిపే సౌకర్యం.
*పారదర్శకత. *ఆధునిక సాంకేతికత వినియోగం. *వివక్షకు తావులేకుండా ఉండడం. *అతితక్కువగా అధికారుల జోక్యం
ధరణి నిర్వహణా ప్రత్యేకతలు
*అడ్వాన్స్ గా స్లాట్ బుకింగ్ సౌకర్యం.
రైతు స్వేచ్చగా ఏ రోజూ, ఎన్ని గంటలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తానే నిర్ణయించుకునే సౌలభ్యం,
*బయో మెట్రిక్ నిర్ధారణ. *ప్రతీ సర్వే నెంబర్ కు మార్కెట్ విలువ నిర్దారణ. *రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్. *రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ సుంకం మొత్తం ఆటోమేటిక్ గా నిర్దారణ సౌలభ్యం. *ఆన్లైన్ చెల్లింపులు. *అక్కడికక్కడే ఈ-పట్టాదార్ పాస్ పుస్తకం జారీ. *పోస్ట్ ద్వారా పట్టాదార్ పాస్ పుస్తకం బట్వాడా. *నిషేదిత భూములకు ఆటో-లాక్ విధానం.
నిత్యం పెరుగుతున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయని చెప్పారు.
*రాష్ట్రంలో ధరణి పురోగతి వివరాలు*
హిట్‌ల సంఖ్య : 5.17 కోట్లు
బుక్ చేసిన స్లాట్‌లు : 10,45,878
*పూర్తయిన లావాదేవీలు* : 10,00,973
విక్రయాలు : 5,02,281
గిఫ్ట్ డీడ్ : 1,58,215
వారసత్వం : 72,085
తనఖా : 58,285
*పరిష్కరించబడిన ఫిర్యాదులు* : 5.17 లక్షలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
నిషేధించబడిన జాబితా : 51,794
కోర్ట్ కేసులు మరియు సమాచారం : 24,618
జిల్లాలో ధరణి పురోగతి వివరాలు
జిల్లాలో ధరణి పురోగతి మరియు
లావాదేవీలు :
హిట్ ల సంఖ్య 5485,
బుక్ చేసిన స్లాట్స్ 1553,
పూర్తి అయిన లావా దేవిలు 1539,
విక్రయాలు 647,
బహుమతి 165,
వారసత్వం 77,
తనఖా 45,
నాల 235,
మ్యుటేషన్ 378.
పరిష్కరించబడిన
పిర్యాదులు 3846.
పెండింగ్ మ్యుటేషన్ 479.
భూమి విషయాలపై పిర్యాదు 2141.
నిషేధించిన జాబితా 547.
కోర్టు కేసు మరియు సమాచారం 29,
ఫారం ఎల్ 750,
గ్రామాల వారిగా నిషేధిత ఆస్తుల్లో తప్పుగా చేరితే వాటిని పరిష్కరించేందుకు ప్రేత్యేక డ్రైవ్ చే పట్టనున్నట్లు చెప్పారు. భూ సమస్యల పరిస్కారం కొరకు ప్రజలు ప్రజావాణికి బదులు మీ సేవలో నామ మాత్రపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ప్రజలు ధరణి ఉపయోగించు కోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్వో అశోక్ చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, తహసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.