భూ సమస్యలకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

డిశంబరు, 03, ఖమ్మం:

భూ సమస్యలకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులపై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వివిధ మండలాల్లో తహశీల్దార్ల వద్ద గల లోకాయుక్త, హెచ్ ఆర్.సి. హైకోర్టు పెండింగ్ కేసులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ కోర్టు కేసులకు సంబంధించి తహశీల్దార్లు తమ పరిధిలో వారానికి ఒకరోజు కేసులు పరిష్కారం కోసం కేటాయించాలని గడువుకంటే ముందే కౌంటర్ దాఖలు చేయాలని డిస్పోజ్ అయిన కేసుల నివేదికలను జిల్లా లీగల్ సెల్కు సమర్పించాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ కేసులపై సత్వర పరిష్కార చర్యలకు గాను రెవెన్యూ డివిజనల్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించి గడువుకంటే ముందే కౌంటర్ దాఖలు చేసే విధంగా పర్యవేక్షించాలని ఆర్.డి.ఓలను కలెక్టర్ ఆదేశించారు సర్వేకు సంబంధించిన కేసులకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారుల సహకారంతో నిబంధనల మేరకు సర్వే ప్రక్రియ జరగాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే తహశీల్దార్ల వద్ద ఉన్న పెండింగ్ కేసులకు కౌంటర్ దాఖలు చేయడంతో పాటు  డిస్పోజ్ అయిన కేసుల వివరాలను సత్వరమే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్ మధుసూదన్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు టెలీ కాన్ఫరెన్స్ లో   పాల్గొన్నారు.

Share This Post