భూ సమస్యలపై ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తులను పరిష్కరించడానికి అందరూ కృషిచేయాలి : జిల్లా కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనిని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తున్నారని…కావున తాసిల్దార్ లు తమ వద్దకు వచ్చే రైతులను మళ్లీ మళ్లీ తిప్పించుకోకుండా ఆ సమస్యను ఎన్ని రోజులలో పరిష్కరిస్తారో తెలపాలని లేదా సమస్యను పరిష్కరించ లేకపోతే అందుకు గల కారణాలను రైతులకు వివరించాలని కలెక్టర్ తాసిల్దార్ లను కోరారు.

మండలాల వారీగా జరుగుతున్న మ్యుటేషన్ రిజిస్ట్రేషన్ పై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

భూ సమస్యలపై ప్రజావాణిలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని వాటి పరిష్కారానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఓ రాజేంద్రనాథ్, ఆర్ డి ఓ మహేందర్ జి, మరియు అన్ని మండలాలకు చెందిన తహసీల్దార్లు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post