భూ సమస్యలు పరిష్కారం కొరకు ధరణి ఆన్లైన్ పోర్టల్లో ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రజలకు సూచించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల వినతులు స్వీకరించి, పరిష్కరించేందుకు  అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కారానికి మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తు చేయాలని, వచ్చిన దరఖాస్తులను తహసిల్దార్లు విచారణ నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. సమస్యను తక్షణం పరిష్కరించాలని, పరిష్కారానికి అవకాశం లేకుండా ఉన్న సమస్య ఉన్నట్లైతే అదే సమాచారాన్ని పిర్యాదుదారునికి లిఖితపూర్వకంగా తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు కొన్ని: బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి సిద్దెల రవి చారిత్రిక నేపథ్యం కలిగిన కారుకొండ బౌద్ధ ఆరామాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు  సుప్రసిద్ధ బౌద్ధ ఆరామాలున్న ప్రాంతం ఆక్రమణలకు గురవుతున్నదని,  అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని పరిరక్షణ చర్యలు  చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదికలు అందచేయాలని జిల్లా పర్యాటక అధికారిని ఆదేశించారు. మణుగూరు మండలం, బండారుగూడెం గ్రామానికి చెందిన కారం అనంతరాములు సర్వే నెం.138/3/ఆలో తనకు 31 గుంటల భూమి కలదని, తన ప్రక్క పొలం వ్యక్తులు కొంతభూమిని ఆక్రమించుకున్నారని, అట్టి భూమి సర్వే  నిర్వహణకు పలుమార్లు దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని, వారసత్వంగా వచ్చిన భూమిని సర్వే నిర్వహించి తనకు న్యాయం చేకూర్చాలని దరఖాస్తు చేశారు. జూలూరుపాడు మండలం, మాచినపేట గ్రామానికి చెందిన భూక్యా ఈరు ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటి గోడ కూలిపోయిందని, ఇల్లు దిగువ ప్రాంతంలో ఉండుట వల్ల నీట మునుగుతున్నదని, తనకు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు కొరకు తహసిల్దార్ కు సిఫారసు చేశారు. చుంచుపల్లి మండలం, యన్కే నగర్ కు చెందిన సాయికుమార్ తో పాటు 10 మంది వ్యక్తులు 12వ వార్డులో సౌకార్యలు లేక ఇబ్బందులు పడుతున్నామని, రహదారి సౌకర్యం కూడా లేదని, మురుగునీటి నిల్వలు పేరుకు పోవడం  వల్ల దోమలు వ్యాప్తితో పాటు పందుల సంచారం జరుగుతున్నదని తద్వారా ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతున్నారని సౌకర్యాలు కల్పనకు చర్యలు చేపట్టాలని చేసిన ధరఖాస్తును ఈ ఈ పిఆర్, ఇరిగేషన్ పరిశీలించి నివేదికలు అందచేయాలని ఎండార్స్ చేశారు. దుమ్ముగూడెం మండలం, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు తమ నుండి అక్విటెన్సు తీసుకున్నారని, నష్టపరిహారం మంజూరు కాలేదని,  రబీ పంట సాగుచేయొద్దని, రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారని, పరిహారం అందక, పంట సాగు చేయక నష్టపోతున్నామని, ప్రాజెక్ట్ నిర్మాణంలో కోల్పోతున్న భూమికి ఎకరాకు 25 లక్షలు పరిహారం అందించు విధంగా చర్యలు చేపట్టాలని చేసిన దరకాస్తును తగు చర్యలు నిమిత్తం భూ సేకరణ పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు. సుజాతనగర్ మండలం, సీతంపేటకు చెందిన బంజారా రైతులు కొంత మంది  శ్రీ ధనలక్ష్మి పారాబాయిల్ రైస్ మిల్లు  పిఏసిఎస్ కొత్తగూడెం సొసైటి ద్వారా ధాన్యం కొనుగోలు చేశారని, 10 నుండి 30 కేజీల వరకు ధాన్యం తరుగు తీసారని, తమకు న్యాయం చేయాని కోరుతూ దరఖాస్తు చేయగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాలు, సహాకారశాఖ అధికారులకు ఎండార్స్ చేశారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post