*భూ సమస్యల పరిష్కారానికి ధరణితో విప్లవాత్మక మార్పు::జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*భూ సమస్యల పరిష్కారానికి ధరణితో విప్లవాత్మక మార్పు::జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

*భూ సమస్యల పరిష్కారానికి ధరణితో విప్లవాత్మక మార్పు :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య*
జనగామ,నవంబర్ 01: *భూ సమస్యల పరిష్కారానికి ధరణి తో విప్లవాత్మక మార్పు వచ్చి౦దని జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అన్నారు. సోమవారం జాఫర్ ఘడ్ మండల కేంద్రంలో మండల పరిషత్ హాలులో ఎంపిపి రడపాక సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి విశిష్ట అతిధిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాఫర్ ఘడ్ మండలంలోని 9 గ్రామాల్లో 900 సర్వే నెంబర్లోని 2వేల 5 వందల మంది రైతులకు చెందిన 5 వేల 106 ఎకరాల భూమిని 2007 సంవత్సరంలో అప్పటి అధికారులు (పిఓబి) నిషేదిత , ప్రభుత్వ భూమి అని వ్రాయడం వాళ్ళ నిషేదిత భూ జాబితాలోకి వచ్చి౦దని అన్నారు. ధరణి కి రాక పూర్వం గతంలో తహసిల్దార్ లు ఎన్ ఓ సి ఇస్తే రిజిస్ట్రేషన్ లు జరిగేవని ధరణి వచ్చాక రిజిస్ట్రేషన్ లు జరగటం లేదని రెవెన్యు రికార్డుల్లో పట్టా భూమిగా ఉన్నా రిజిస్ట్రేషన్ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉందని అందువల్ల ప్రభుత్వ పరంగా రైతు బందు, రైతు భీమా, బ్యాంకు రుణాలు వంటి సౌకర్యాలు అందక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టి కి వచ్చిందని కలెక్టర్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె. చంద్రశేఖర్ రావు గారు ప్రవేశపెట్టిన ధరణి వెబ్ సైట్ ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసినట్లు తెలిపారు. జిల్లాలో ధరణీ ద్వారా ధరఖాస్తు చేసుకున్న అన్ని భూ సమస్యలు పూర్తిగా పరిష్కరించామని కలెక్టర్ తెలిపారు
ఈ సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత స్టేషన్ ఘనపూర్ ఎం ఎల్ ఏ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజా శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. అందులో భాగంగా జాఫర్ ఘడ్ మండలంలోని రైతుల భూ సమస్యలు గుర్తించి ధరణి ద్వారా పరిష్కరించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య , అదనపు కలెక్టర్ (రెవెన్యు) ఏ. భాస్కర్ రావు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి మండల సభ, ప్రజాప్రతినిదులు వారిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, ఎంపిపి రడపాక సుదర్శన్, ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ గుజ్జర రాజు, జెడ్ పి టి సి ఇల్లందుల బేబి శ్రీనివాస్ పి ఎ సి ఎస్ చైర్మెన్ కరుణాకర్ రాజు, వైస్ ఎం పి పి కడారి కనకయ్య, ఎంపిడిఓ శ్రీధర్ స్వామి, మండల వ్యవసాయ అధికారి హరిదాస్, పి హెచ్ సి డాక్టర్ రాజు, ఎంపిఓ శ్రీనివాస్, ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Share This Post