భృణ హత్యలు నేరం, ఆడ శిశువులను కాపాడవలసిన భాద్యత మనాడే: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

*భ్రూణ హత్యలు నేరం,ఆడ శిశివులను* *కాపాడిల్సిన బాధ్యత మనదే*

-గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్ట వ్యతిరేకం

-భ్రూణ హత్యల నివారణకు పటిష్ట చర్యలు

– *జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

—————————-

భ్రూణ హత్యలు నేరమని, ఇవి జరగకుండా ప్రభుత్వ , ప్రైవేటు గైనకాలజిస్టులు , రేడియాలజిస్టులు స్కానింగ్ కేంద్రాలు, పి సి పి ఎన్ డి టి చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అందరి పై ఉందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

మంగళవారం సాయంత్రం IDOC లోని మినీ మీటింగ్ హల్ నందు గర్భస్థ పిండ లింగనిర్థారణ నిషేధ చట్టం అమలుపై జిల్లా వైద్య అధికారులు, ప్రైవేట్ గైనకాలజిస్ట్ లతో
జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ మండలాల్లో జనాభాలో ప్రతి వెయ్యిమంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారో తెలిపే లింగనిష్పత్తి గణాంకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ గణాంకాల కన్నా లింగనిష్పత్తి తక్కువగా ఉన్న మండలాల్లో ఇప్పటి వరకూ తీసుకున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భ్రూణ హత్యలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు దిశా, నిర్దేశం చేశారు.

జిల్లాలో భ్రూణ హత్యల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో ఉన్న అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సెంటర్స్‌ పై నిఘా ఉంచాలన్నారు. పోలీసు సిబ్బంది సహకారంతో డెకారు ఆపరేషన్లు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కానింగ్‌ సెంటర్స్‌ పై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి స్కానింగ్‌ సెంటర్‌ నందు పి.సి.అండ్‌ పి.ఎన్‌.డి.టి యాక్టు ఐ.ఈ.సి తప్పని సరిగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పి.సి.అండ్‌ పి.ఎన్‌.డి.టి యాక్టుపై ప్రజలకు అవగాహన కల్పించేలా పోస్టర్లు, కరపత్రాలు ముంద్రించి ప్రచారం నిర్వహించాలన్నారు.

కమిటీ తరచుగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని కోరారు. జిల్లా వైద్యాధికారి, ప్రోగ్రామ్ అధికారులు రెగ్యులర్ తనిఖీల తో పాటు కౌన్సిలింగ్ కూడ చేయాలన్నారు.

ప్రతి కేసు కు అడిట్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు.
జిల్లాలో లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్న అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

—————————-
*స్వీయ నియంత్రణ పాటిస్తేనే…..*
*సిజేరియన్ లకు అడ్డుకట్ట వేయవచ్చు*

– అనవసర సిజేరియన్ లు వద్దు

– నాగరిక సమాజానికి సిజేరియన్ కాన్పులు శుభ సూచకం కాదు

– గర్భిణీ తో పాటు వారి కుటుంబ సభ్యులను సిజేరియన్ వల్ల నష్టాల పై అవగాహన కల్పించాలి

– మొదటి కాన్పు సాధారణ ప్రసవం అయ్యేలా చూడాలి

– రాష్ట్ర సాధారణ ప్రసవాల శాతం కంటే జిల్లా శాతం మెరుగ్గా ఉండాలి

– *జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
—————————-

స్వీయ నియంత్రణ పాటిస్తేనే….. రాజన్న సిరిసిల్ల జిల్లాలో
సిజేరియన్ లకు అడ్డుకట్ట వేయవచ్చునని
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

వరల్డ్ హెల్త్ ఆర్గైజేషన్ ప్రకారం సాధారణ ప్రసవాలు 90 శాతం కావాల్సి ఉండగా జిల్లాలో అందుకు విరుద్ధంగా జరుగుతుందనీ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సిజేరియన్ లు 80 శాతం ఉంటే జిల్లాలో 90 శాతం – 94 శాతం మధ్యలో సిజేరియన్ కాన్పులు జరగడం బాధాకరమని అన్నారు.

మహిళలు లు , ప్రజా రోగ్యం దృష్ట్యా సిజేరియన్ కాన్పులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.మొదటి కాన్పు సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలన్నారు.
ఇకపై ప్రతి రోజూ సిజేరియన్ డెలివరీలపై ఎథికల్ ఆడిటింగ్ నిర్వహించాలని ప్రైవేట్ ప్రసూతి ఆసుపత్రి వైద్యులకు సూచించారు.
కేసుల వారీగా బర్త్ ప్లానింగ్ చేసుకోవాలన్నారు.
తానూ ప్రసూతి ఆసుపత్రులు, వైద్యుల నుంచి అద్భుతాలు ఆశించడం లేదని…. పురోగతి కోరుకుంటున్నానని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పష్టం చేశారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ బి సత్య ప్రసాద్, అదనపు ఎస్పీ శ్రీ చంద్రయ్య, జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీ రాములు సిరిసిల్ల, వేములవాడ జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు, డాక్టర్‌ మహేష్‌రావు, సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ మీనాక్షి,
ఇమ్మ్యూనైజేషన్ అధికారి డా. మహేష్, పీఓ లు డా. కపిల్, డా. శ్రీరాములు, డా. రాజశేఖర్, మానేరు NGO అధ్యక్షులు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
——————————

Share This Post