మంగళవారం గడ్డి అన్నారంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టీమ్స్) మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ భవన నిర్మాణ పనులకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారు.

మంగళవారం గడ్డి అన్నారంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్
(టీమ్స్) మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ భవన నిర్మాణ పనులకు గౌరవ
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శంకుస్థాపన చేశారు.

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హైదరాబాద్ నగరానికి నలుమూలలా హాస్పిటల్స్ ను
ఏర్పాటు చేసే నేపథ్యంలో ఈ రోజు గడ్డి అన్నారం, సనత్ నగర్, అల్వాల్ లో
ఆసుపత్రుల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మాత్యులు మహమ్మద్ అలీ, వైద్య ఆరోగ్య శాఖ
మాత్యులు తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా
ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నగర మేయర్
గద్వాల విజయలక్ష్మి, జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ హరినాథ్ రెడ్డి,
ఎమ్మెల్సీలు వాణీ సురభి దేవి, జనార్దన్ రెడ్డి, దయానంద్, ఎగ్గే మల్లేష్,
మూసీ రివర్ బోర్డు ఫ్రంట్ చైర్మన్, శాసన సభ్యులు సుధీర్ రెడ్డి,
శాసనసభ్యులు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్,
జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ పోలీస్ కమీషనర్   మహేష్ భగవత్,
వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు,మాజీ ఎమ్మెల్యే తీగల
కృష్ణారెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
స్వరాజ్య లక్ష్మి, స్థానిక తహశీల్దార్ రామ్ మోహన్, సంబంధిత అధికారులు
తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Share This Post