మంగళవారం నాడు తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయంలో కరిపె రాజ్ కుమార్ ఆంగ్ల కవిత్వ సంకలనం “అన్ సంగ్ అదిలాబాద్” ను అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తో కలిసి ఆవిష్కరించారు.

ఈ నేల సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయలు, ఇక్కడ ఎగిసిన తిరుగుబాట్లు, ఉద్యమాలన్నీ తెలంగాణ సాహిత్యంలో పుష్కలంగా ఉంటాయని శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయంలో కరిపె రాజ్ కుమార్ ఆంగ్ల కవిత్వ సంకలనం “అన్ సంగ్ అదిలాబాద్” ను అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “అన్ సంగ్ అదిలాబాద్” పుస్తకంలో కవితలన్నీ ఆ ప్రాంత మట్టి చరిత్రలను తెలియజేస్తాయన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ స్థానికత ఆధారంగా ఆ ప్రాంత గిరిజన గోండు ఆదివాసీ తెగల జీవన సంస్కృతిని తెలియచేసే సహాజ కవితలు ఈ సంకలనంలో ఉన్నాయన్నారు. తెలంగాణ భూమి పుత్రునిగా కరిపె రాజ్ కుమార్ కవిత్వం రాశారన్నారు. ఈ ఆవిష్కరణలో కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ పంతంగి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Share This Post