పత్రిక ప్రకటన:-
సిద్దిపేట 17 జనవరి 2023
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం ఆవరణ చుట్టూ మరియు పక్కన గల ఈవిఎమ్ గోదాంను కమిషనర్ ఆప్ పోలిస్ శ్వేతతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్..
కలెక్టరేట్ ఆవరణ మొత్తం కలియ తిరిగారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సైన్ బోర్డు లు, సెక్యూరిటీ విషయంలో అదనపు సిసి కెమెరాలు తో గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చెయ్యాలన్నారు. నూతనంగా నిర్మించిన ఈవీఎం గోదాం లోపల మొత్తం చుశారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈవీఎం గోదాం మొత్తం ప్లాన్ ని వివరించారు. గోదాం చిన్నంగా ఉన్నందున ప్రక్కనే మరొక అదనపు గది ఏర్పాటుతో పాటు గోదాం ప్రహరీ, పైన గట్టి ఇనుప ఫెన్సింగ్, పకడ్బందీగా ఉండాలని. సెక్యూర్ గా ఉండాలని, గోదాం కి కన్ స్టక్షన్ సంబంధించి సూచనలు చేశారు. ఆర్ &ఆర్ ఈఈ సుదర్శన్ ని దీనికి కావలసిన ప్లానింగ్ ఎస్టిమెట్ ను తయారుచేస్తే యుద్ధ ప్రాతిపదికన పుర్తి కావాలన్నారు. అనంతరం ఎలిపాడ్, కోర్టు భవనం, వెటర్నరీ కాలేజికి ప్రతిపదించిన ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఎడి సర్వేయర్ వినయ్ కుమార్ మ్యాప్ ద్వారా మొత్తం నమూనా పటాన్ని చూపించారు. రాజీవ్ రహదారి నుండి భవనాలకు వెళ్తే రోడ్డు మార్గాన్ని త్వరగా మ్యాప్ ను రుపోందించి ఎస్టిమేట్ వేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయ్యాలని అధికారులను ఆదేశీంచారు.
issued by dpro Siddipet District