మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి పాఠశాలల ఆకస్మిక తనిఖీలు చేసి, తొలి మెట్టు కార్యక్రమ అమలును పరిశీలించారు.

మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి పాఠశాలల ఆకస్మిక తనిఖీలు చేసి, తొలి మెట్టు కార్యక్రమ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ తిరుమలాయపాలెం మండలంలోని మహ్మదాపురం గ్రామ మండల ప్రజాపరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, బీరోలు గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలల తనిఖీలు చేశారు. విద్యార్థులు ఎలా చదువుతున్నది, వారి నోట్ పుస్తకాలు, ఉపాధ్యాయుల బోధనా విధానాలను ఆమె పరిశీలించారు. విద్యార్థులు రాసిన పరీక్షలు, ఉపాధ్యాయులచే పత్రాలు దిద్దినది, ఎన్ని మార్కులు వేసినది పరిశీలించారు. తరగతి గదిలో కూర్చొని బోధనా విధానాన్ని ఆమె పరిశీలించారు. విద్యార్థుల మౌళిక సామర్థ్యాల పెంపు ఉద్దేశ్యంగా తొలి మెట్టు కార్యక్రమం రూపొందించిబడిందని, కార్యక్రమ విజయవంతానికి తమ వంతు కృషి చేయాలని ఆమె అన్నారు.
అదనపు కలెక్టర్ తనిఖీ సందర్భంగా మండల విద్యాధికారి రామాచారి, ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారిణి జ్యోతి, ఏఎంఓ రవి కుమార్ తదితరులు ఉన్నారు.

Share This Post