మంచి లాభాలు సమకూర్చాలి:: జిల్లా కలెక్టర్ డి హరిచందన

మంచి లాభాలు సమకూర్చాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

నారాయణపేట జిల్లా మండలం సింగారం గ్రామం లో మండల మహిళ సమాఖ్య అద్వర్యం లో చైతన్య గ్రమైక్య సంఘం సింగారం గ్రామం లో ఆగర్బత్తుల తయారీ కేంద్రాన్ని  జిల్లా కలెక్టర్ డి హరిచందన, యస్. రాజేందర్ రెడ్డి రిబ్బేన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారికీ  శుభాకాంక్షలు తెలుపుతూ మంచి లాభాలు సమకూర్చాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన అన్నారు. సింగారం గ్రామం లో కమ్యూనిటీ హాల్ లో ఆగర్బత్తుల తయారీ యంత్రాన్ని నారాయణపేట శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి తో కలిసి  పరిశీలించి తయారు చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. DRDO అరణ్య బ్రాండ్ ద్వారా తయారుచేసిన ఆగర్బతులను విక్రయించడం జరుగుతుందని శాసన సభ్యులు లకు మహిళలు  తెలిపారు.

ఈ కార్యక్రమం లో DRDO గోపాల్, DPM రాము, జెడ్పిటిసి అంజలి రాములు, ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్, మహిళ సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.    

Share This Post