మంజూరైన డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక.

మంజూరైన డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్,
ఫిబ్రవరి -06:

జిల్లాలో మంజూరైన డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, అదేవిధంగా డబల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జాబితాను వేగవంతం గా చేపట్టాలని కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ ఐ.డి.ఓ.సి లోని చాంబర్ లో రడబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, లబ్దిదారుల ఎంపికపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా అర్హత ఉన్న లబ్దిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేయాలని, ఇండ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించి లబ్ది దారుల ఎంపిక వేగవంతం చేయాలని ఆర్డీవో లను ఆదేశించారు.

అదేవిధంగా మంజూరు అయినటువంటి డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలని, మంచినీరు, విద్యుత్ సరఫరా, ఇంకా ఇతర అవసరాలను వేగవంతంగా చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను, విద్యుత్ అధికారులను, తహశీల్దార్ లను ఆదేశించారు.

ఈ సమీక్షలో మహబూబాబాద్, తొర్రూరు ఆర్డీవో లు డి.కొమురయ్య, ఎల్.రమేష్ ఈ ఈ,డీఈ లు,తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post