మంజూరైన దళిత బంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలి దళిత బంధు పథకానికి అర్హులైన వారందరి ఖాతాలలో డబ్బులు జమ చేయాలి డైరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న వారినీ పాడి గేదేల కొనుగోలు కోసం పంపించాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పత్రికా ప్రకటన.

తేదీ: 5-1-2022

కరీంనగర్

మంజూరైన దళిత బంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలి

దళిత బంధు పథకానికి అర్హులైన వారందరి ఖాతాలలో డబ్బులు జమ చేయాలి

డైరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న వారినీ పాడి గేదేల కొనుగోలు కోసం పంపించాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
Oo0

హుజూరాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకం కింద మంజూరైన యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో
దళిత బంధు పథకం అమలుపై క్లస్టర్ అధికారులు, గ్రౌండింగ్ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తప్పి పోయిన దళిత బంధు లబ్ధిదారుల ఇంటింటి సర్వే చేసి అర్హులైన వారిని గుర్తించి వారందరీ ఖాతాలు ఓపెన్ చేసి, వారి ఎకౌంట్లలో నగదు జమ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. అర్హులై ఉండి ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో డబ్బు జమ కాని వారందరికీ వెంటనే నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. డైరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న వారికి షెడ్ల నిర్మాణం కోసం రూ. 1.50 లక్షలు చొప్పున వెంటనే అందజేయాలని తెలిపారు. దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్ లో ఎంపీడీవోలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. లబ్ధిదారులకు యూనిట్ల ఎంపికలో అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు ఇప్పటికే ఎంపిక చేసుకున్న యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. డైరీ యూనిట్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చి, పాడి గేదెల కొనుగోలు కోసం పంపించాలని అన్నారు. పాడి గేదెల కొనుగోలు కోసం లబ్ధిదారులను బ్యాచ్ ల వారిగా హర్యానా, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు పంపించాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు ఇదివరకే వ్యాపారం చేస్తుంటే వారి వ్యాపారం విస్తరణ కొరకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. జెసిబి, హార్వెస్టర్, డి సి ఎం వాహనాల కొనుగోలు కోసం గ్రూపులుగా వచ్చినవారికి వాహనాలు అందించాలని తెలిపారు. దళిత బంధు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ రెడ్డి, డి ఆర్ డి ఓ శ్రీలత, ఉప రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్ గౌడ్, క్లస్టర్ అధికారులు, గ్రౌండింగ్ అధికారులు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post