మండలం వారిగా ప్రతి హ్యబిటేషన్ లో అదనంగా సబ్ సెంటర్లు పెంచి 100 శాతం వ్యాక్సినేషన్ అయ్యేలా, చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రికా ప్రకటన                                                         తేదీ: 09-10-2021

మండలం వారిగా ప్రతి హ్యబిటేషన్ లో  అదనంగా సబ్ సెంటర్లు పెంచి   100 శాతం  వ్యాక్సినేషన్ అయ్యేలా, చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

శనివారం సమావేశం హాలు నందు ఎం పి డి ఓ లు, మెడికల్ అధికారుల తో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ రాష్ట్రం లోనే మన జిల్లా వ్యాక్సినేషన్ లో చాలా వెనుకబడి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు.   జిల్లా లో మండలం  వారిగా సబ్ సెంటర్లు పెంచి  ప్రతి ఒక్క హ్యబిటేషన్ లో  18 సం  .లు పూర్తి అయిన  ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అయ్యేలా చూడాలని  అన్నారు. కేటి దొడ్డి , ఘట్టు, ఇటిక్యాల , ఐజ ,గద్వాల్  ఈ సెంటర్లలో వ్యాక్సినేషన్  సెంటర్లు అదనంగా ఏర్పాటు చేసి , సర్పంచు లతో మాట్లాడి  100 శాతం వ్యాక్సినేషన్ అయ్యేలా చూడాలని , అందరి అధికారుల సమన్వయం తో ఈ కార్యక్రమం జరిగేటట్లు చూడాలని, వ్యాక్సిన్ అందుబాటులో ఉంది జనాభాను దృష్టిలో  పెట్టుకొని , లొకేషన్ చూసుకొని వ్యాక్సిన్ జరగాలని,  మోబిలైజేషన్ మీద దృష్టి పెట్టి, అందరు ఫీల్డు లో తిరుగుతూ వ్యాక్సినేషన్ తొందరగా పూర్తి  చేయాలన్నారు. ఆశ, అంగన్వాడి, ఏ ఎన్ ఎం లు వారిని కన్విన్సు చేయాలన్నారు.   ఈ కార్యక్రమాన్ని స్పెషల్డ్రైవ్ గా చేపట్టి వ్యాక్సినేషన్  పూర్తి అయ్యేలాచూడాలని  ఆదేశించారు.  మండలం వారిగా మీకున్న టార్గెట్ ఎంత, ఇప్పటివరకు గ్రామాలలో  ఎంత వ్యాక్సినేషన్ పూర్తి చేశారు, ఇంకా ఎంత మంది పెండింగ్ ఉన్నారు  అని డేటా తీసుకొని పరిశీలించారు.

జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ  ప్రతి వార్డులో ఆటో లో రికార్డు చేసి చెప్పాలని,  అందరిని మోబిలైజ్ చేసి వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. ప్రతి రోజు రిపోర్ట్ ఇవ్వాల్లన్నారు

సమావేశం లో జిల్లా వైద్య అధికారి చండునయాక్, జడ్పి సి ఇ ఓ విజయ నాయక్, ఎం పి డి ఓ లు, ఎం పి ఓ లు, మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి  జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయబడినది.

Share This Post