మండలాలలో విద్యుత్ ఏ ఈ లు సక్రమంగా విధులు నిర్వహించకుంటే ఉద్యోగాలు మానుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత విద్యుత్ అధికారులను హెచ్చరించారు.

పత్రికా ప్రకటన                                                         తేది: 6 -5- 2022

మండలాలలో విద్యుత్ ఏ ఈ లు సక్రమంగా విధులు నిర్వహించకుంటే ఉద్యోగాలు మానుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ సరిత  విద్యుత్ అధికారులను హెచ్చరించారు.

శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏడవ స్థాయి సంఘం నిర్మాణ పనులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్తు, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, రహదారులు భవనాలు, ఇంజనీరింగ్ విభాగం శాఖల అధికారులు వారి ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. జిల్లాలోని మండలాలలో విద్యుత్ ఏ ఈ  లు సకాలంలో స్పందించడం లేదని మండలాలలో విధులు నిర్వహించలేని వారు ఉద్యోగాన్ని వదిలి పెట్టాలని హెచ్చరించారు. గ్రామాలలో విద్యుత్ స్తంభాలు వాటికి వైర్లు లేవని విద్యుద్దీపాలు, ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంజూరైన పనులు పూర్తి చేయాలని అన్నారు. రహదారులు భవనాల గురించి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రోడ్లు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గద్వాల, ఐజ రోడ్డు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపామని త్వరలో పనులు పూర్తి చేస్తామని సంబంధిత అధికారి తెలిపారు. రోడ్డు సమీపంలో హద్దులు ఏర్పాటు చేసి మొక్కలు నాటేoదుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు.  జిల్లా కలెక్టర్ కార్యాలయంఎపుడు పూర్తి అవుతుంది అని అడుగగా  జూలై మాసం వరకు  పూర్తి చేస్తామని సంబందిత అధికారి వివరించారు. నీటి పారుదల శాఖ గురించి మాట్లాడుతూ ఆర్డీఎస్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ 24 నుండి 40 వరకు కాల్వలలో సిల్ టు పేరుకుపోయిందని, వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇటిక్యాల మండలం నుండి సిల్ట్ తొలగించే పని చేపట్టినట్లు అధికారి తెలిపారు. పుల్లూరు వరకు కాలువ ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఉండవెల్లి జడ్పిటిసి కోరారు. వర్షాలు పడక ముందే సిల్ట్ తొలగించాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీరాజ్ పరిధిలోని రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ,సీఈఓ విజయ నాయక్  సంబందిత శాఖ అధికారులు  తదితరులు హాజరయ్యారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి చే జారీ చేయబడినది.

 

 

.

Share This Post