మండలాలల్లో నిర్దేశించిన మన ఊరు మన బడి, క్రీడ ప్రాంగణాలు త్వరగా పనులు పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.

ప్రచురణార్థం

మండలాల్లో నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.

*మండలంలో జరుగుతున్న పనులను ప్రతి రోజు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలి

*ప్రతి హ్యాబిటేషన్ లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలి

*నర్సరీ లలో అవసరం మేరకు మొక్కల పెరుగుదలకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

*గ్రామీణ ఉపాధి హామి పనులలో లేబర్ కాంపోనెంట్ పెంచాలి

 

*మండలంలో జరుగుతున్న మన ఊరు బడి పనులను పర్యవేక్షించాలి

జిల్లాలోని ఎంపిడిఓ లు, సంభందిత శాఖల జిల్లా అధికారులతో మండలంలో జరుగుతున్న పనులపై
ప్రతిరోజు పర్యవేక్షిస్తూ మండలాల్లో నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు పూర్తి అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ ఎంపిడిఓ లను, జిల్లా అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎంపిడిఓ లు, సంభందిత శాఖల జిల్లా అధికారులతో గ్రామ పంచాయతీలో జరుగుతున్న పనులు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీ లలో మొక్కల పెంపకం, గ్రామీణ ఉపాధి హామీ పనులు, దళిత బంధు, మన ఊరు మన బడి పనుల పై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.

స్వచ్ఛ భారత్ మిషన్ రెండో విడతలు లో భాగంగా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేయాలని ఇంకుడు తడి తడి చెత్త పొడి చెత్త ఇంటి స్థాయిలోనే వేరుచేసి డాక్టర్కు అందజేసే నా గ్రామస్తులను చైతన్యం చేసే విధంగా పంచాయతీలకు తగు ఆదేశాలు జారీచేసి తద్వారా అన్ని గ్రామా పంచాయతీలను ఓడిఎఫ్ ప్లస్ మోడల్ గ్రామపంచాయతీలుగా మలచి ఓడిఎఫ్ జీపీలుగా డిక్లేర్ చేయాలని ఎంపీడీవోలకు ఎంపీలకు ఏపీయులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ -20 23 క్రింద ఈనెల 31 లోపు ప్రతి గ్రామపంచాయతీ విలేజ్ లెవెల్ సెల్ఫ్ అసైన్మెంట్ ఆన్లైన్ చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పల్లె ప్రకృతి వనాలు యాప్ లో అప్లోడ్ చేయాలని తప్పక చేయాలని కలెక్టర్ తెలిపారు.

మండల అధికారులు తమ పరిధిలో జరుగుతున్న పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నిర్లక్ష్యం కనబర్చిన వారిపై చర్యలు తీసుకుంటామని సూచించారు.

గ్రామ పంచాయతీల్లో, ప్రతి హ్యాబిటేషన్ లో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి యువత ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికీ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్రీడా ప్రాంగణాల ఏర్పాటు చేయని ప్రదేశాలలో స్థలాలను తహశీల్దార్ లతో మాట్లాడి వెంటనే గుర్తించి నివేదిక సమర్పించి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

గ్రామాలలో నర్సరీ లను సందర్శించాలని, అందులో పెరుగుతున్న మొక్కలను పరిశీలించాలని, రాబోయే సంవత్సరానికి ప్లాంటేషన్ కొరకు ఎన్ని మొక్కలు అవసరం ఉంటాయి, ఏ సైజ్ లో ఎన్ని ఉన్నాయో చూసి మండలంలో అవెన్యూ, ఇన్స్టిట్యూషనల్, గృహ అవసరాల మేరకు ఎంత మేరకు అవసరం అవుతాయి అంచనా వేసి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, పెరుగుతున్న మొక్కలకు నీటి సరఫరా జరుగుతున్నది, లేనిది, మట్టి సేకరణ, సీడ్స్ తో పాటు, మొక్కల పెరుగుదలను గమనించాలని, ప్రతి వారం మానిటరింగ్ చేస్తూ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేయాలని తెలిపారు.
ఉపాధి హామీ పనులలో ఎఫ్.టి. ఓ. జనరేషన్ తక్కువ నమోదు కావడం జరుగుతున్నదని, లేబర్ కంపోనెంట్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మండలాల వారీగా లేబర్ కంపోనేంట్ పెంచాలని, ప్రతి రోజూ పంచాయతీ సెక్రెటరీ లు చేస్తున్న పనికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేసేవిధంగా చూడాలని ఆదేశించారు.

జిల్లాలో మన ఊరు మన బడి తమ తమ మండలాల్లో మన ఊరు మన బడి క్రింద జరుగుతున్న పాఠశాలల్లో చేపడుతున్న పనులను పరిశీలన చేసి ఎస్టిమేట్ ల ప్రకారం, నాణ్యతగా పనులు జరిగే విధంగా పరివేక్షించాలన్నారు

ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఓ. కిరణ్ కుమార్, , ఏపీ డి పెంటయ్య డిపిఓ యాదయ్య డి ఎల్ పి ఓ సాంబిరెడ్డి ఈజిఎస్ అంబుడ్స్ మెన్ లచ్చి రామ్ నాయక్ ఎస్ బి ఎం కోఆర్డినేటర్ నాగేందర్ సిబ్బంది ,జిల్లాలోని ఎంపిడిఓ లు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సూర్యాపేట జారీ చేయనైనది.

Share This Post