మండలాల వారీగా చేపట్టిన పనుల పురోగతిపై ఎంపీడీఓలతో కలెక్టర్ నిఖిల సమీక్ష

జిల్లాలో బృహత్ పల్లె ప్రకృతి వనాలలో గుంతలు తీసి మొక్కలు నాటే పనులను వెంటనే చేపట్టాలని, అలాగే ప్రతి మండలానికి నాలుగు చొప్పున మినీ పల్లె ప్రకృతి వనాల కొసం స్థల సేకరణ గవించి ఎస్టిమేషన్ జెనరేషన్ పనులు జరగాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఎంపీడీఓ లను ఆదేశించారు.
ఈరోజు స్థానిక DPRC భావనంలో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల పనుల పురోగతి పై మండలాల వారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలలో గుంతలు తీయడం, మొక్కలు నాటే పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రతి మండలానికి నాలుగు చొప్పున మినీ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు స్థల సేకరణ జరగాలని దేనికోసం తహసీల్దార్ ల సహకారంతో పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా అన్ని మండలాల్లో లక్ష్యం మేరకు వంద శాంతం మొక్కలు నాటి అట్టి వివరాలు ప్రభుత్వ వెబ్ -సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు అన్ని మండలాల వారిగా జీపీ లలో చేపట్టిన పనులు మరియు చెల్లింపుల వివరాల నివేదిక అందజేయాలని DRDO ను కలెక్టర్ ఆదేశించారు. వైకుంఠ దామలకు సంబంధించిన చెల్లింపుల పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారం నర్సరీలలో పని చేసే వన సేవకుల వేతనాలు చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వారి వేతనాలు అండీ విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
గ్రామాలలో ఇంకుడు గుంతల పనులను వేగవంతం చేయాలని, NREGS కార్మికులు అధిక సంఖ్యలో పనులలో పాల్గొనే విధంగా చూడాలని సూచించారు. వచ్చే సంవత్సరం అన్ని హరితహారం నర్సరీలు ప్రభుత్వ స్థలాలకు మార్చాలని, ప్రతి జీపీ నర్సరీలలో ఇక నుండి 15 వేల మొక్కలు పెంచాలన్నారు. అసంపూర్తి పనులు, చెల్లిపుల పనులు వారం రోజులలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే సాహించేది లేదని తీవ్రంగా మందలించారు. యాప్ ద్వారా ప్రతి రోజువారి పనుల పురోగతిని పరిశీలిస్తానని ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, DRDO కృష్ణన్, డీపీవో మల్లారెడ్డి, ఇంచార్జి పంచాయతీ రాజ్ EE ఉమేష్ లతో పాటు అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీవోలు, ఈసీలు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post