మండలాల వారీగా టార్గెట్స్ త్వరిత గతిన పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

వార్త ప్రచురణ:
ములుగు జిల్లా:
తేదీ:06-12-2021.(సోమవారం )

జిల్లాలో చెప్పట్టిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు తీరుపై జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని ఎంపీడీవోలు లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమ్యూనిటీ సోక్ పిట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ,బృహత్ పల్లె ప్రకృతి వనం లు, కిచెన్ షేడ్స్ పైన మండలాల వారీగా టార్గెట్ , సాధించిన లక్ష్యాల పైన జిల్లా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ , మండలాల వారీగా టార్గెట్స్ త్వరిత గతిన పూర్తి చేయాలి అన్నారు. లేబర్ టర్నోవర్ పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పల్లె ప్రకృతి వనంల ను తరచుగా పనుల పర్యవేక్షణ చేస్తూ మొక్కల సర్వేవాల్ రేటును పెంచాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి,డిఆర్డివో నాగ పద్మజా, ఎపిడి వెంకటనారాయణ, సంబందిత మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Share This Post