మండల న్యాయ సేవా సమితి, భువనగిరి *ప్రెస్ నోట్* 5.6.2022 నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భువనగిరి కోర్టు ఆవరణలో యదాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు భువనగిరి మండల న్యాయ సేవా సమితి అధ్యక్షులు వి. బాల భాస్కర రావు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. మారుతి దేవి, సీనియర్ సివిల్ జడ్జి వి. రజనిలు కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా యదాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయ సేవా సమితి అద్యక్షులు వి. బాల భాస్కర రావు మరియు న్యాయ మూర్తులు మాట్లాడుతూ పర్యావరణాన్ని అందరూ బాధ్యతగా రక్షించాలని , ప్లాస్టిక్ ను నిషేదించాలని, ప్రతీ ఒక్కరు పర్యావరణ చట్టాలను గౌరవించి ఆ ప్రకారంగా నడుచుకోవాలని తెలిపి పారా లీగల్ వాలంటీర్లచే ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమములో న్యాయవాది విఘ్నేష్, పారా లీగల్ వాలంటీర్లు కె. వెంకన్న, పురుషోత్తం, శ్రీశైలం, సత్యనారాయణ, జె అంజయ్య, పర్యావరణ సేవాకర్త పురుషోత్తం రెడ్డి పాల్గొని చిరు వ్యాపారులకు పర్యావరణం పై అవగాహన కల్పించారు

Share This Post