ప్రచురణార్ధం
మే.02. ఖమ్మం
మండల పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను మండల పరిధిలోనే పరిష్కారించాలని, ఆయా మండల పరిధికి సంబంధించిన జిల్లా అధికారులకు సమస్యను తెలియజేసి సత్వర పరిష్కార స్వభావం చూపాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత శాఖల మండల, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం మధిర మండల కేంద్రం వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన “గ్రీవెన్స్ డే “లో అర్జీదారులను నుండి పలు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించి సమస్యల పరిష్కార చర్యకై సంబంధిత అధికారులను ఆదేశించినారు. ఋణ పించన్లు, భూ సమస్యలు, డబుల్ బెడ్రూమ్ గృహాలకు సంబంధించిన దరఖాస్తులను అర్జీదారులు జిల్లా కలెక్టర్కు అందజేశారు. మధిర మండలం రాయపట్నం గ్రామంకు చెందిన దేవరకొండ కవిత తాను వికలాంగురాలునని చెప్పుల షాపు నిర్వహించుకొనుటకు లోన్ దరఖాస్తు చేసుకోవడం జరిగినదని శాంక్షన్ ఆర్డర్ ఇచ్చినారని కాని ఇప్పటివరకు లోన్ ఇవ్వలేదని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి సత్వర చర్యకై ఎస్సీ కార్పోరేషన్ అధికారికి కలెక్టర్ సూచించారు. మధిర పట్టణం శివాలయం వీధికి చెందిన శ్రీనిధి తనకు డబుల్ బెడ్రూమ్ గృహం ఇప్పించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం జిల్లా, రెవెన్యూ అధికారికి కలెక్టర్ సూచించారు. తల్లాడ మండలంకుర్నవల్లి గ్రామంకు చెందిన ఎస్.కె. మధార్ సాబ్, చావా రవి, వెంకటాచారీ, కోటిరెడ్డిలు తమ గ్రామంలో త్రాగునీటి కొరతను పరిష్కరించగలరని సమర్పించిన -దరఖాస్తును మిషన్ భగీరథ అధికారులకు సమస్య పరిష్కారంపై సత్వర చర్యలు గైకొనాలని కలెక్టర్ ఆదేశించారు. మధిర మండలం మదుపల్లి గ్రామంకు చెందిన అంబేద్కర్ లెథర్ ప్రోడక్ట్స్ సొసైటీ సభ్యులు లెథర్ పార్క్ నిర్మాణముకై నిధులు మంజూరు చేయగలరని, దళిత చర్మరాదులు కుటుంబములకు ఉపాధి కల్పించగలరని సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తగు చర్య నిమిత్తం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఎస్సీ కార్పోరేషన్. అధికారులకు కలెక్టర్ సూచించారు మధిర పట్టణం ఎస్సీ కాలనీకు చెందిన జి.శారమ్మ తాను టైలరింగ్ యూనిట్ స్థాపనకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా లోన్ సాంక్షన్ అయినదని, సబ్బిడీకి సంబంధించిన పైకం కూడా బ్యాంకు వారికి అంచడం జరిగిందని ఇంతకు బ్యాంకు అధికారులు లోనక్కు సంబంధించిన జాప్యం చేస్తున్నారని. సమర్పించిన దరఖాస్తును పరిశీలన చేసి సత్వర చర్యకై జిల్లా కలెక్టర్ లీడ్ బ్యాంక్ మేనేజరు సూచించినారు. మధరకు చెందిన మార్త రాములు తనకు సర్వేనెం. 362/శలో 0.16.00 కుంటల భూమి ధరణి పాస్బుక్ నుందు నమోదు కాలేదని పాస బుక్ అట్టి భూమని నమోదు చేయగలరని సమర్పించిన అర్జీని, రేగళ్ళ శివలీలా సద్దినేనిగూడెం రెవెన్యూ పరిధిలో పట్టా నెం. 114/4/1212లో 30 గుంటల భూమి పాస్ పుస్తకములో నమోదు. చేయించగలరని సమర్పించిన దరఖాస్తును, మధిర పట్టణంకు చెందిన వంకాయలపాటి నాగ ప్రతిభ తనకు ఖాతా నెం: 393 సర్వేనెం.265/1లో 0, 30 కుటల విస్తీర్ణం కలదని అట్టి భూమికి ధరణి పోర్టల్ పాసు పుస్తకం ఇప్పించగలరని సమర్పించిన అర్జీని పరిశీలించి తగు చర్మకై సంబంధిత తహశీల్దారును ఆదేశించినారు. గ్రీవెన్స్ డే లో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.అప్పారావు, ఖమ్మం ఆర్.డి.ఓ రవీంద్రనాద్ అవివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.