మండల స్థాయి కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి -జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్

@ మన ఊరు -మనబడి పనులను వేగవంతం చేయాలి

@ ఉపాధి హామీ పథకం కింద కూలీల సంఖ్యను పెంచండి

@ మండల స్థాయి కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి -జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్

మన ఊరు- మనబడి కింద చేపట్టిన పాఠశాల పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ముందుగా ఆయన తహసిల్దార్ కార్యాలయంలోని గదులను పరిశీలించారు. ధరణి విభాగాన్ని తనిఖీ చేసి ధరణి కింద ఇప్పటివరకు వచ్చిన, పరిష్కరించిన దరఖాస్తులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై తహసిల్దార్ బక్క శ్రీనివాసులు ద్వారా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రికార్డ్ రూమ్ ను పరిశీలించారు . రికార్డ్ రూమ్ ను ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.

పక్కనే ఉన్నఎం పి డి ఓ కార్యాలయంలోని గదులను పరిశీలించి ఎం సి సి కేంద్రాన్ని కూడా పరిశీలించి ఎంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారని?,ఎంత మంది టీఎలు పనిచేస్తున్నారని ? ఎంపీడీఓ ధనుంజయ్ గౌడ్ ను అడిగారు.ఉపాధి హామీ పథకం కింద ఎంత మంది కూలీలు పని చేస్తున్నారని అడగగా సరాసరి 34 మంది పని చేస్తున్నారని తెలుపగా కూలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు.

పక్క గ్రామానికి చెందిన మహిళ పాస్ బుక్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి రావడం జరిగిందని తెలుపగా, పాస్ బుక్ జారి విషయమై తాహసిల్దార్ కు ఆదేశాలు జారీ చేశారు

ఆ తర్వాత పంచాయతీరాజ్ ఏ ఈ సురేష్ తో మన ఊరు- మన ఊరు మనబడి కింద ఎన్ని పాఠశాలల పనులు చేపట్టారని ,ఎన్ని పూర్తయ్యాయని,అడుగగా ఏ ఈ మాట్లాడుతూ వేపూరులో చేపట్టిన పాఠశాల నిర్మాణం ప్రారంభానికి సిద్దంగా ఉందని తెలిపారు.

ఈ సందర్బంగా మండల ఎంపిపీ బాలరాజు ,జెడ్పిటిసి భర్త రవీందర్ రెడ్డి ,కో ఆప్షన్ సభ్యులు మన్న న్, ఎంపిటి సి కల్పన,ఎంపిడివో ధనుంజయ్ గౌడ్,తహసీల్దార్ బక్క శ్రీనివాసులు, తదితరులు శాలువాతో సన్మానించారు.

 

Share This Post