మండుటెండల్లో చెరువులు మత్తడ్లు దూకుతున్నాయి. ఎండాకాలంలో మత్తడి దూకడమంటే.. చరిత్ర తిరగ రాయడమే పైరవీలు లంచాలు లేకుండా రైతులకు.. రైతుబంధు బీమా డబ్బులు కాలుకు, మెడకు పెట్టి బీజేపీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది. ప్రస్తుత కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించొద్దు.. అనారోగ్యాలకు గురికావొద్దు. ప్రభుత్వం నార్మల్ డెలివరీలనే ప్రోత్సహిస్తది త్వరలోనే సిద్దిపేట లైబ్రరీలో కడుపునిండా ఉచిత భోజనం నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలి సిద్ధిపేటలో నిరుద్యోగుల కోసం ఉచితంగా కేసీఆర్ కోచింగ్ కేంద్రం నిర్వహణ – రాఘవాపూర్ గ్రామ పర్యటనలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు


మండుటెండల్లో చెరువులు మత్తడ్లు దూకుతున్నాయి.

ఎండాకాలంలో మత్తడి దూకడమంటే.. చరిత్ర తిరగ రాయడమే

పైరవీలు లంచాలు లేకుండా రైతులకు.. రైతుబంధు బీమా డబ్బులు

కాలుకు, మెడకు పెట్టి బీజేపీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది.

ప్రస్తుత కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించొద్దు.. అనారోగ్యాలకు గురికావొద్దు. ప్రభుత్వం నార్మల్ డెలివరీలనే ప్రోత్సహిస్తది

త్వరలోనే సిద్దిపేట లైబ్రరీలో కడుపునిండా ఉచిత భోజనం

నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలి

సిద్ధిపేటలో నిరుద్యోగుల కోసం ఉచితంగా కేసీఆర్ కోచింగ్ కేంద్రం నిర్వహణ

– రాఘవాపూర్ గ్రామ పర్యటనలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

రాఘవాపూర్ 23 మార్చి 2022 :

రాబోయే రోజుల్లో మీరంతా పాస్ కావాలని చదవొద్దు. ర్యాంకు రావాలని చదవాలి. సిద్ధిపేట జిల్లా, రాష్ట్ర టాపర్ గా ఉండాలి. కేజీబీవీ విద్యార్థినీలు రాష్ట్ర స్థాయిలో టాపర్ గా ఉండాలని పోటీ పడి చదివి పైకి ఎదగాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ఆకాంక్షించారు.

సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కేజీబీవీ పాఠశాల తరగతి గదులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
మొన్న జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఆడపిల్లలు 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినీలకు 100 కోట్ల రూపాయల వ్యయంతో హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ఇవ్వాలని నిర్ణయించిందని పేర్కొన్నారు.

7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినీలకు వచ్చే నెల ఏప్రిల్ నెల నుంచే హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ అందిస్తామని మంత్రి వెల్లడించారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో అందరికీ ఇంగ్లీషు మీడియం విద్య అందించాలని, పేద పిల్లలను మంచి విద్యకై ప్రయివేటుకు పంపిస్తున్నారని, కార్పోరేట్ ధీటుగా 7300 నిధులు కేటాయించి మన ఊరు-మన బడి ప్రారంభం చేశారని తెలిపారు.

అలాగే 7, 8, 9వ తరగతిల్లో ఇప్పటికే ఇంగ్లీషు మీడియం ఉండగా, ఒక్కో విద్యా సంవత్సరం ఒక్కో తరగతి ఇంగ్లీషు మీడియం తరగతులు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
ఇంగ్లీషు మీడియం విద్య రాబోయే తరాలకు ఎంతగానో ఉపయోగకరమని, ఇక పై ప్రయివేటు స్కూళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని, పేద తల్లిదండ్రులకు వేల రూపాయల ఫీజులు భారం లేకుండా కార్పోరేట్ స్థాయిలో ఇంగ్లీషు మీడియం విద్యను అందించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
నా ఊరికి నేను సేవ చేయాలని ఎంతో వ్యయప్రయసాలకు లోనై ఏంపీపీ శ్రీదేవి చందర్ కృషి చేశారని కొనియాడారు. రాఘవాపూర్ కేజీబీవీ పాఠశాలకు డ్యూయల్ డెస్కులు కావాలని కోరగా, అందజేస్తామని భరోసా ఇచ్చారు.

అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఖరారు చేశారని, ఇది వరకే 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

త్వరలోనే సిద్దిపేట లైబ్రరీలో చదువుకునే కడుపునిండా ఉచిత భోజనం పెడతామని, నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్ కావాలని కోరుతూ.. నిరుద్యోగ అభ్యర్థులు కోసం ఉచితంగా కేసీఆర్ కోచింగ్ కేంద్రం నిర్వహణ చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ పేరిట ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు, సిద్ధిపేటలో పోటీ పరీక్షలకు, కానిస్టేబుల్ శిక్షణకు, గ్రూపు 1, 2, 3, 4 అన్నీ రకాల ఉద్యోగాలకు పైసా ఖర్చు లేకుండా హైదరాబాదు నుంచి నిష్ణాతులైన అధ్యాపకులచే ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నట్లు యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్ రావు కోరారు.
సిద్ధిపేట జిల్లా లైబ్రరీ కేంద్రంలో ఉద్యోగాలకై చదివే యువత కై రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా భోజనం పెట్టిస్తానని భరోసాను ఇచ్చారు.
ఈ యేడాది ఇంటి అడుగుజాగలో ఇళ్లు కట్టుకునేందుకు 3 లక్షలు అందిస్తామని, అలాగే ఎస్సీ మాల సంఘం భవనంకై 10 లక్షలు, కోటి రూపాయలతో పీఏసీఎస్ భవనం ప్రారంభం చేసినట్లు, గ్రామంలో ఏఎన్ఎమ్ సబ్ సెంటరుకై రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి హామీనిచ్చారు.

రాఘవాపూర్ లో మోకాలి నొప్పులకు ట్రీట్మెంట్ కోసం బొక్కల డాక్టర్, ఆర్థో పెడిక్ వైద్యుల బృందం గ్రామానికి వస్తుందని సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు కూడా గ్రామానికి వస్తుందని, గ్రామ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో మండుటెండల్లో చెరువులు మత్తడ్లు దూకుతున్నాయని, ఎండాకాలంలో మత్తడి దూకడమంటే.. చరిత్ర తిరగ రాయడమేనని అది సీఎం కేసీఆర్ తోనే సాధ్యమైందని చెప్పారు.
పైరవీలు లంచాలు లేకుండా రైతులకు.. రైతుబంధు, రైతు బీమా డబ్బులు అందిస్తున్నట్లు తెలిపారు.
వడ్లు కొనుగోలు చేయకుండా లేనిపోనివి చెబుతూ.. కాలుకు, మెడకు పెట్టి బీజేపీ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని కేంద్రం తీరుపై విమర్శించారు.

ప్రస్తుత కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించొద్దు.. అనారోగ్యాలకు గురికావొద్దు. ప్రభుత్వం నార్మల్ డెలివరీలనే ప్రోత్సహిస్తదని, నార్మల్ డెలివరీలతో తల్లీబిడ్డల ఆరోగ్యం బాగా ఉంటుందని అవగాహన కల్పించారు.

Share This Post