మంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ అభివృద్ధి పథకాల పనులపై సమీక్ష సమావేశం : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది:24.01.2022, వనపర్తి.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాల పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.
సోమవారం వనపర్తి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కొరకు ఏర్పాటుచేసిన దళిత బందు పథకానికి  నియోజకవర్గం నుండి 100 మంది లబ్ధిదారులను గుర్తించి, మార్చిలోగా ఎంపిక చేసి వెంటనే అమలు చేసేలా అన్ని చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో వార్డుకు ఒక్కరు చొప్పున 6 లేదా 7 కుటుంబాలను ఎంపిక చేయాలని ఆయన తెలిపారు. శ్రీరంగాపూర్, రేవల్లి మండలాల్లో ఐదు కుటుంబాల చొప్పున ఎంపిక చేయాలని, మిగిలిన ఎంపిక ఆయా మండలాలలో జాప్యం లేకుండా పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ రెండు పడక గదుల ఇండ్లు, పల్లె ప్రకృతి వనాలు, సిసి రోడ్లు, బిటి రోడ్లు, రెవెన్యూ, మున్సిపాలిటీ, అటవీశాఖ స్థలాల సరిహద్దులు, వ్యాక్సినేషన్, రైతుల సమస్యలు, ఎల్పీజీ గ్యాస్ పైపులైన్ పనులు, కేజీబీవీ రేవల్లి స్థల పరిశీలన, ఎలక్ట్రిసిటీ, బాలరక్షా భవన్ స్థల పరిశీలన, పి ఎస్ ఎస్ గోదాము స్థల పరిశీలన, ఇరిగేషన్ తదితర అంశాలపై ఆమె మంత్రితో చర్చించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post