మంత్రి శ్రీ కే తారక రామారావు కు అరుదైన కానుక
– టేకు కర్రపై చిత్రించిన సీఎం శ్రీ కేసీఆర్ ప్రతిమను బహూకరించిన యువకుడు చేపూరి సంతోష్ చారి
– యువకుడికి మంత్రి అభినందన
*రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన చేపూరి సంతోష్ చారి సీఎం శ్రీ కేసీఆర్ పై ఉన్న ప్రత్యేక అభిమానంతో కేసీఆర్ ప్రతిమను తయారు చేశాడు.వృత్తిరీత్యా వడ్రంగి అయిన సంతోష్ చారి
సీఎం చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆకర్షితులైన సంతోష్, కేసీఆర్ ప్రతిమను తయారు చేయాలనే సంకల్పంతో, దాదాపు వారం నుండి పది రోజులు కష్టపడి సీఎం శ్రీ కేసీఆర్ ప్రతిమను తీర్చిదిద్దాడు. కేసీఆర్ ప్రతిమతో పాటు నాగలి,గొర్రు తయారు చేశాడు.
గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ టు పీజీ క్యాంపస్ ప్రారంభానికి మంత్రి తారక రామారావు బుధవారం రావడంతో…..
మంత్రిని కలిసి సిఎం కేసిఆర్ టేకు ప్రతిమను
చేపూరి సంతోష్ చారి బహుకరించారు.
ప్రతిమను ఆసక్తిగా తిలకించిన మంత్రి శ్రీ తారక రామారావు సంతోష్ చారిని ప్రత్యేకంగా అభినందించారు.