మక్తల్ మండలంలో చిట్యాల, పంచదేవ్ పహాడ్ గ్రామాలలో బతుకమ్మ చీరల ను పంపీణి చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు మరియు ఎంపిపి వనజ దత్తు గారు

మక్తల్ మండలంలో చిట్యాల, పంచదేవ్ పహాడ్ గ్రామాలలో బతుకమ్మ చీరల ను పంపీణి  చేసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కె వనజ ఆంజనేయులు గౌడ్ గారు మరియు ఎంపిపి వనజ దత్తు గారు

 

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు మన ఆడపడుచులకు చీరలను సారేగా మన కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుందనీ, రాష్ట్రవ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరలను మన ప్రభుత్వం పంపిణీ చేస్తుందనీ, 18 సంవత్సరాలు దాటిన తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని,జిల్లాలో దాదాపు రెండు లక్షల మందికి బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కోటి బతుకమ్మ చీరల పంపిణీ చేస్తుందని,

ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల అంచులతో  339.73 కోట్ల రూపాయలను మన ప్రభుత్వం ఖర్చు చేసి చీరలను తయారు చేయించిందని,

ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని 2017లో మన ప్రియతమ ముఖ్యమంత్రి  శ్రీ  కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ప్రారంభించారని, ఈ కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు ఒక గొప్ప భరోసా వచ్చిందని.. వారి వేతనాలు రెట్టింపు అయ్యాయని, తద్వరా వారు తమ కాళ్లపైన తాము నిలబడే పరిస్ధితికి చేరుకున్నారని  తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఉపాధి లేక ఆగమైన నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్  సార్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. బతుకమ్మ చీరెల పంపిణీ తో అటు ఆడబిడ్డలకు ఆనందంతో పాటు ఏడాది పొడవునా నేతన్నలకు ఉపాధి భరోసా దొరికిందని తెలిపారు.ఈ కార్యక్రమం ప్రారంభం అయిన నాటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా ఈసంవత్సరం కలుపుకుని సూమారు 5 కోట్ల 81 లక్షల చీరలను ఆడబిడ్డలకు అయిదు దఫాలుగా మన కేసీఆర్ ప్రభుత్వం అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీ శ్రీధర్ గారు ఎంపీఓ శ్రీమతి పావని గారు చిట్యాల సర్పంచ్ శ్రీమతి జానకి గారు, ఎంపీటీసీ శ్రీ రామలింగప్ప గారు, పంచాయతీ కార్యదర్శి గౌతమ్ గౌడ్ గారు, పంచదేవపాడు సర్పంచ్ శ్రీమతి కల్పన గారు,పసుపుల సర్పంచ్ శ్రీ దత్తప్ప గారు, శ్రీ మైపాల్ రెడ్డి గారు, వెలుగు సిసి  శ్రీ కురుమన్న గారు, ఇతర అధికారులు మరియు ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు

Share This Post