మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం—-2
పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి సెప్టెంబర్ 9:-
పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో సమావేశ మందిరంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ సంరక్షణ కోసం జిల్లాలో 1000 మట్టి విగ్రహాలను కలెక్టరేట్ లో , పెద్దపల్లి బస్ స్టాండ్ ఆవరణలో,గోదావరిఖని బస్ స్టాండ్ లో మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేసామని తెలిపారు. ఆదిదేవుడైన వినాయకుని మట్టితో తయారు చేసి పూజించటం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని, మన ఆకాంక్షలు నెరవేరుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ సంరక్షణ జరుగుతుందని, మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత కరోనా వైరస్ మూడవ దశ వ్యాప్తి అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు పాటిస్తూ వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, బయట మాస్కులు ధరించాలని సూచించారు. జిల్లాలోని ప్రజలందరికీ కలెక్టర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతి రావు,ఈ.డి.ఎస్. సి. కార్పొరేషన్ రాజేశ్వరి, పొల్యూషన్ కంట్రొల్ బోర్డు అధికారి రవిదాస్, కలెక్టరేట్ ఏఓ .కె.వై. ప్రసాద్, కలెక్టరేట్ సూపరిండెంట్ లు తూము రవీందర్,దత్తు ప్రసాద్,నారాయణ,అనుపమ రావు,కలెక్టరేట్ సిబ్బంది,
సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి చేజారి చేయబడినది.

Share This Post